క్రీడాభూమి

అది ప్రతిపాదన మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 7: తాను మూడో పెళ్లి చేసుకున్నట్టు వచ్చిన వార్తలను రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఖండించాడు. బుస్రా మనేకా అనే మహిళను తాను ప్రపోజ్ మాత్రమే చేశానని తెలిపాడు. మనేకాను మూడో పెళ్లి చేసుకునే విషయమై ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పిల్లలదే తుది నిర్ణయమని ఆదివారం ఇమ్రాన్ ఖాన్ తరఫున ఆయన ప్రతినిధి ఒకరు పేర్కొన్నాడు. మనేకాను ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు నిరాధారమని, ఇది చాలా సున్నితమైన అంశమని, అదంతా అతని వ్యక్తిగతమని, ఇలాంటి అంశాలను చిలువలు పలువలు చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ పెళ్లి ప్రతిపాదనను మనేకా అంగీకరించి ఉంటే ఆయనే స్వయంగా మీడియా ముందు వెల్లడించేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. మీడియా సంయమనం పాటించి మనేకాను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడనే వార్తలకు అనసర ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం ద్వారా ఆ రెండు కుటుంబాలకు, ముఖ్యంగా వారి పిల్లల గోప్యతను కాపాడిన వారవుతారని ఆయన సూచించాడు. ఇదిలావుండగా, 66 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 40 ఏళ్ల మనేకాను లాహోర్‌లో జనవరి 1వ తేదీన పెళ్లి చేసుకున్నట్టు పాకిస్తాన్‌లోని ఒక మీడియాలో వచ్చిన వార్తలను ఖండించాడు. ఇమ్రాన్ ఖాన్ 1995 మే 16న జమీమా ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, తొమ్మిదేళ్ల తర్వాత వారి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల 2004 జనవరి 22న వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2015 జనవరి 8న రెహామ్ అనే టీవీ యాంకర్‌ను రెండో పెళ్లి చేసుకున్నట్టు బహిరంగంగానే ఇమ్రాన్ ఖాన్ వెల్లడించాడు. తాజాగా మరోసారి అతను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేయ డంతో, బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. రాజకీయాలకు, వ్యక్తితగ జీవితానికీ సం బంధం లేదని అతను అంటున్నప్పటికీ, మీడియా అతనిపైనే దృష్టి పెట్టింది.