క్రీడాభూమి

భారత్ విధానంలోనే సెలక్షన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 7: భారత క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ మాదిరిగానే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ల ఎంపిక జరగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన కమ్రాన్ అక్మల్ సూచించారు. పాక్ జాతీయ సెలక్టర్లతో పోలిస్తే, భారత సెలక్టర్ల ఎంపిక ఎంతో బాగుందని, అందుకే, ఆటగాళ్లు రాణిస్తున్నారని అన్నారు. రోహిత్ శర్మ పరుగుల సగటు ఒకానొక దశలో 25 నుంచి 30 పరుగులకు పడిపోయినప్పటికీ, అతనిని జట్టులోనే కొనసాగించిన సెలక్టర్లు తగినన్ని అవకాశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆతర్వాత రోహిత్ ఏ విధంగా దూసుకెళుతున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జట్టులోని ఆటగాళ్లను తరచు మార్చకుండా, నిలకడగా కొన్నాళ్లు కొనసాగిస్తే, మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.