క్రీడాభూమి

విదేశాల్లోనూ విజయాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న టీమిండియా విదేశాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తుందని, తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తుందని నరేంద్ర బండే అనే జోతిష్కుడు ఘంటాపథంగా చెప్తున్నాడు. విదేశాల్లో టోర్నీలను, సిరీస్‌లను భారత క్రికెట్ జట్టు గెల్చుకోలేకపోతున్నదని ఇన్నాళ్లూ ఉన్న ముద్ర ఇకపై తొలగిపోతున్నదని పీటీఐతో మాట్లాడుతూ బండే ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ జాతకంలో శుక్ర మహర్దశ జరుగుతున్నదని, దీని ఫలితంగా విదేశాల్లోనూ అతను జైత్రయాత్రలు సాగిస్తాడని అన్నాడు. సచిన్ తెండూల్కర్ టెన్నిస్ ఎల్గో సమస్యతో బాధపడుతున్నప్పుడు, అతని కెరీర్‌కు తెరపడుతుందని అంతా ఊహించారని, కానీ, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ కెరీర్‌ను కొనసాగిస్తానని తాను చెప్పానని అన్నాడు. తాను పేర్కొన్న విధంగానే సచిన్ కెరీర్ ముందుకు సాగిందన్నాడు. అదే విధంగా, మహేంద్ర సింగ్ ధోనీ వరుస వైఫల్యాలతో అల్లాడుతున్న సమయంలో అతనికి జట్టులో స్థానం ఉండకపోవచ్చన్న వాదన వినిపించిందని, అయితే, 2019 వరల్డ్ కప్‌లో అతను ఆడతాడని తాను చెప్పానని బండే అన్నాడు. తాను చెప్పినట్టుగానే, వైఫల్యాలను అధిగమించిన ధోనీ ఇప్పుడు వనే్డ జట్టులో కీలక సభ్యుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడని తెలిపాడు. సౌరవ్ గంగూలీ, మురళీ కార్తీక్, శ్రీశాంత్, జహీర్ ఖాన్, గౌతం గంభీర్ సురేష్ రైనా తదితరులు తరచు తనను సంప్రదిస్తుంటారని, వారికి సలహాలు, సూచనలు తానే ఇస్తానని అన్నాడు.
గత ఏడాది ఐసీసీ మహిళ వరల్డ్ కప్‌లో మిథాలీ రాజ్ నేతృత్వంలో భారత జట్టు ఫైనల్ చేరడంలో, తాజాగా రంజీ ట్రోఫీని విదర్భ జట్టు కైవసం చేసుకోవడానికి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కోలుకోవడానికి తాను ఇచ్చిన సలహాలే కారణమని ఢిల్లీకి చెందిన జోతిష్కుడు నరేంద్ర బండే ప్రకటించుకున్నాడు. కింగ్స్ ఎలెవెన్ సహ భాగస్వామి ప్రీతీ జింటాకు కీలకమైన సూచనలు చేశాననీ, ఆతర్వాత ఆ జట్టు కోలుకుందని అతను అన్నాడు. 33వ నంబర్ ఉన్న జెర్సీని ధరించాలని తాను భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు సూచించానని, తన సలహా పాటించినందుకే మహిళల వరల్డ్ కప్‌లో జట్టు ఫైనల్ చేరిందన్నాడు. అదే విధంగా విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్ తనను సంప్రదించినప్పుడు, 24వ నంబర్ జెర్సీని వేసుకోవాలని సలహా చెప్పినట్టు బండే తెలిపాడు. ఫజల్ ఆ జెర్సీని వేసుకొని, ఏకంగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందుకున్నాడని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా విదేశీ పర్యటనలపై తాను చెప్పిన జోస్యం కూడా ఫలిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న భారత జట్టు ఈ ఏడాది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ పర్యటించనుంది.