క్రీడాభూమి

షాట్ల ఎంపికలో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, జనవరి 12: షాట్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు మాజీ బ్యాట్స్‌మన్ చందూ బోర్డే సూచించాడు. కేప్ టౌన్‌లో జరిగిన మొదటి టెస్టులో 72 పరుగుల తేడాతో టీమిండియా ఓడడానికి బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ అతను అభిప్రాయపడ్డాడు. ఆఫ్ స్టంప్ నుంచి దూరంగా వెళుతున్న బంతులను విడిచిపెట్టాలని అతను సలహా చెప్పాడు. వికెట్‌కీపర్‌కు లేదా స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి ఎక్కువ మంది బ్యాట్స్‌మన్ ఔటయ్యారని అతను గుర్తుచేశాడు. స్టంప్స్ నుంచి దూరంగా, అత్యంత వేగంతో దూసుకెళ్లే బంతులను విడిచిపెట్టకుండా, వాటిని వెంటాడడం వల్లే సమస్యలు వస్తున్నాయని స్పష్టం చేశాడు. షాట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉంటే, వికెట్లు పారేసుకునే ప్రమాదం నుంచి బయటపడవచ్చని అన్నాడు. భారత్‌కు విజయావకాశాలు లేకపోలేదని, అయితే, బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని చందూ బోర్డే అన్నాడు.