క్రీడాభూమి

జాతీయ మహిళల బాక్సింగ్‌లో ‘ఎస్’త్రయానికి స్వర్ణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహ్‌తక్, జనవిర 12: జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ‘ఎస్’త్రయం, సర్జూబాలా దేవి, సోనియా లాథర్, సరితా దేవి తమతమ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. 48 కిలోల ఫ్లైవెయిట్ విభాగంలో సర్జూబాల (మణిపూర్) తన ప్రత్యర్థి రీతూ (హర్యానా)ను ఓడించి టైటిల్ అందుకుంది. 54 కిలోల విభాగంలో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు ప్రాతినిథ్యం వహించిన సోనియా 5-0 తేడాతో శశి చోప్రాను చిత్తుచేసింది. కాగా, 60 కిలోల విభాగంలో సరితా దేవి కూడా 5-0 ఆధిక్యంతోనే పవిత్రను ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకుంది.