క్రీడాభూమి

కపిల్ దరిదాపులోకీ రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 12: భారత్‌కు మొదటిసారి ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన కపిల్ దేవ్‌తో ఎవరినీ పోల్చడానికి వీల్లేదని, టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అతని దరిదాపుల్లోకి కూడా రాలేదని మాజీ బౌలర్ కర్సన్ ఘావ్రీ స్పష్టం చేశాడు. కపిల్ 59వ జన్మదినోత్సవం సందర్భంగా లెజెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఘావ్రీ మాట్లాడుతూ, హార్దిక్ గురించి కొంత మంది చేసిన వ్యాఖ్యలను తాను పేపర్లలో చదివానని అన్నాడు. కొన్ని పత్రికలు అతనిని కపిల్ కంటే గొప్ప ఆల్‌రౌండర్‌గా అభివర్ణించడం దురదృష్టకరమని చెప్పాడు. కపిల్‌తో అతనిని పోల్చడం సరికాదని అన్నాడు. హార్దిక్ ఏ స్థాయిలో జాతీయ జట్టుకు సేవలు అందిస్తాడన్నది కాలమే చెప్తుందని వ్యాఖ్యానించాడు.
ఇశాంత్‌కు తిక్కుంది!
భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు తిక్కుంది... కానీ, దానికి ఏ లెక్కా లేదు... ఇదీ అతనిపై మాజీ పేసర్ రాజు కులకర్ణి అభిప్రాయం. కెరీర్‌లో 79 టెస్టులు ఆడినప్పటికీ ఇశాంత్ ఎప్పుడూ భారత బౌలింగ్‌ను ముందుండి నడిపించలేకపోయాడని రాజు విమర్శించాడు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోడని, తల తిక్కతో ప్రవర్తించడం వల్ల ఎదగడం లేదని ధ్వజమెత్తాడు. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఉత్తమ సేవలు అందించాలని ఇశాంత్‌కు సూచించాడు.