క్రీడాభూమి

ఆసీస్‌తో పోరుకు భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ వౌంగనూయి, జనవరి 13: మళ్లీ ఎన్నో సంవత్సరాల తర్వాత జరుగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ సందర్భంగా తమ సత్తా చూపాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. వాస్తవానికి శనివారంనాడే ఈ పోటీ ప్రారంభమైనా ఆస్రేలియాతో ఆదివారం జరిగే పోటీలో గెలుపొందడం ద్వారా భవిష్యత్తు బాటలు వేయాలని భారత్ భావిస్తోంది. అందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో జట్టు ఇప్పటికే అన్నివిధాల సిద్ధమైంది. చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ సదవకాశాన్ని అన్నిరకాలుగా సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ యువ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నూరిపోశారు. అయితే, వ్యక్తిగతంగా ప్రతిఒక్క ఆటగాడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోయినా నిష్ణాతులైన యువకులు జట్టులో ఉండడం వల్ల తమ వారంతా ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకునేలా తమ జట్టు ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇప్పటివరకు మూడుసార్లు చాంపియన్‌గా అవతరించింది. చివరిగా 2014లో చాంపియన్‌షిప్ సాధించింది. ప్రస్తుతం భారత్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ముంబై ఆల్‌రౌండర్ పృధ్వీ షా నాయకత్వం వహిస్తుండగా, యూత్ వనే్డ పోటీల్లో అత్యధిక పరుగులు సాధించిన హిమాంశు రాణా, రంజీట్రోఫీలోని ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో క్రీడాభిమానులను ఆకట్టుకున్న పంజాబ్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ వంటి బ్యాట్స్‌మెన్ వంటి టాప్ ఆర్డర్ బాగా ఆడతారనే భారత్ చాలా ఆశలు పెట్టుకుంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్‌గా దిగనున్న అంకుల్ రాయ్, అభిషేక్ శర్మ కూడా తప్పకుండా తమ సత్తా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బెంగాల్ పేసర్ ఇషాన్ పొరె కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడనే భారత్ నమ్మకం పెట్టుకుంది.
బాగా ఆడతామనే నమ్మకం ఉంది : కెప్టెన్ షా
ఐసీసీ అండర్-19 పోటీలో తమ సత్తా నిరూపించేందుకు జట్టు సభ్యులంతా ఆత్మస్ధైర్యంతో ఉన్నారని భారత కెప్టెన్ పృథీ షా తెలిపాడు. ఈ టోర్నీ పాల్గొనేందుకు తమ జట్టు సభ్యులంతా వారం రోజుల కిందటే ఇక్కడకు వచ్చామని, ఇప్పటికే కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడామని అన్నాడు. పోటీకి అన్నివిధాల సంసిద్ధులు కావడం వల్ల అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నాడు. తమ లక్ష్యం మాత్రం ప్రపంచ కప్ సాధించడమేనని, అందులో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ కోసం తాము ఎదురు చూస్తున్నామని అన్నాడు.

చిత్రం..భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ పృథ్వీ షా, కోచ్ రాహుల్ ద్రవిడ్