క్రీడాభూమి

అఫ్గానిస్తాన్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంగరెల్ (న్యూజిలాండ్), జనవరి 13: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ప్రారంభమైన అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అఫ్గానిస్తాన్ బోణీ చేసింది. పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 47.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. రొహైల్ నజీర్ 81 పరుగులు సాధించగా, అలీ జర్యాబ్ ఆసిఫ్ 30 పరుగులు చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లి ఒమార్జల్ 34 పరుగులకు మూడు, కయాస్ అహ్మద్ 38 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. నవీన్ ఉల్ హక్ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 47.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దార్విష్ రసూల్ అజేయంగా 76 పరుగులు సాధించి ఈ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఇమ్రాన్ అలీ ఖిల్ 46, రహ్మానుల్లా గుర్బాజ్ 31 చొప్పున పరుగులు చేసి, అఫ్గాన్ విజయానికి తమ వంతు సహకారాన్ని అందించారు.
వెస్టిండీస్ చిత్తు
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఓపెనర్ కీగన్ సిమన్స్ 92 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, కిమానీ మెలిన్స్ 78 పరుగులు సాధించాడు. మాథ్యూ ఫిషర్ 61 పరుగులకు మూడు, రచిన్ రవీంద్ర 30 పరుగులకు మూడు వికెట్లు తమతమ ఖాతాల్లో వేసుకున్నారు. ఫెలిక్స్ ముర్రే 37 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో రెండు ఇవకెట్లు కోల్పోయి 234 పరుగులు సాధించి, ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఫిన్ అలెన్ సెంచరీ (115)తో నాటౌట్‌గా నిలవగా, జాకబ్ బలా 83 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ ప్రతిభ న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించింది.
జింబాబ్వే గెలుపు
లింకన్: పపువా న్యూ గునియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 10 వికెట్ల ఆధిక్యంతో విజయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పపువా 95 పరుగులకే ఆలౌటైంది. ఇగో మహురు 26, ఒవియా శామ్ 24, సినాకా అరువా 18 చొప్పున పరుగులు చేశారు. మిగతా వారు ఈ మాత్రం స్కోరు కూడా చేయలేకపో చేతులెత్తేశారు. జింబాబ్వే బౌలర్లలో వెస్లీ మాధెవర్ 19 పరుగులకు మూడు, మిల్టన్ షుంబా 19 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు. అనంతరం ఆ జట్టు వికెట్ నష్టం లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. గ్రెగరీ డాలర్ 41, వెస్లీ మాధెవర్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జింబాబ్వేను ఎలాంటి ఇబ్బంది లేకుండా, సునాయాసంగా గెలిపించారు.
నమీబియా ఓటమి
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. మహమ్మద్ నరుూమ్ 60, కెప్టెన్ సైఫ్ హసన్ 84 పరుగులతో రాణించారు. అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించిన నమీబియా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఇవాన్ విక్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పటికీ, ఆలౌట్ కాకుండా ఓవర్లను ముగించడం అందరినీ ఆకట్టుకుంది.