క్రీడాభూమి

ఆరోపణలు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో సభ్యత్వంపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రముఖ క్రికెటర్, మాజీ భారత జట్టు కెప్టెన్ అజారుద్దీన్ స్పష్టం చేశాడస. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అజర్ మాట్లాడుతూ, తనకు హెచ్‌సీఏలో సభ్యత్వం ఉందని, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వేరే ఇతర సంఘాల్లో కొనసాగినప్పటికీ, హెచ్‌సీఏలో సభ్యత్వం పొందే అవకాశం ఉంటుందని చెప్పాడు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తాను కొనసాగడం లేదని స్పష్టం చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన సభ్యత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నాడు. ప్రస్తుత పరిణామాలు, హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలపై బీసీసీఐకి త్వరలో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు. తాను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాననే వార్తలు పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పక్కా హైదరాబాదీనని, దేశంలో హైదరాబాద్‌కు పేరు తెచ్చేందుకే ఇన్నాళ్లు క్రికెట్ ఆడానని అన్నాడు. హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ చేస్తున్న ఆరోపణలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని, వీటిపై చట్టపర్యమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పాడు. ఇటీవల జరిగిన హెచ్‌సీఏ సమావేశానికి ఆహ్వానం వచ్చినందుకే తాను సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లానని స్పష్టం చేశాడు. కొంత మంది వ్యక్తిగత స్వార్థం కోసం టోర్నమెంట్లను నిర్వహించడం సరికాదని, అధికారికంగా పోటీలను నిర్వహిస్తే ప్రతిభగల నిరుపేద క్రీడాకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నాడు. నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత హెచ్‌సీఏపై ఉందన్నాడు. క్రీడాకారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు.