క్రీడాభూమి

స్వప్నం సాకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెడ్డా, జనవరి 13: స్టేడియంలో మ్యాచ్‌లను తిలకించాలన్న సౌదీ అరేబియా మహిళా సాకర్ అభిమానుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. కింగ్ అబ్దుల్లా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో స్థానిక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి అధికారులు మహిళలను అనుమతించారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పట్ట్భాషేకం సందర్భంగా సౌదీ అరేబియా పలు సంస్కరణలను ప్రకటించింది. అందులో భాగంగానే మహిళలకు కూడా స్టేడియాల్లో మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించాలని గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని ఇప్పుడు అమలు చేశారు. ఒక దేశవాళీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కి మహిళలను ‘్ఫ్యమిలీ సెక్షన్’ కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్‌లోకి అనుమతించారు. ఈ ఒరవడి కొనసాగుతుందని, మహిళలకు స్టేడియాల్లో ప్రవేశంపై ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తారనీ సౌదీ క్రీడా ప్రాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీలో మహిళలకు ఇటీవల కాలం వరకూ వాహనాలను నడిపించే అవకాశం ఉండేది కాదు. గత ఏడాది మహిళలకు లైసెన్సులు జారీ చేసిన సర్కారు ఇప్పుడు మహిళా సాకర్ అభిమానుల చిరకాల కలను నెరవేర్చింది.