క్రీడాభూమి

వనే్డల్లో ఆసీస్‌కు ఇంగ్లాండ్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 14: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను 0-4 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ వనే్డ సిరీస్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి వనే్డలో ఆ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ జాసన్ రాయ్ రికార్డు సెంచరీ నమోదు చేయగా, టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చాకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 304 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. ఆరోన్ ఫించ్ (107) సెంచరీతో రాణించగా, మిచెల్ మార్ష్ (50), మార్కస్ స్టొయినిస్ (60) అర్ధ శతకాలు నమోదు చేశారు. లియామ్ ప్లంకెట్ 71 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. అదిల్ రషీద్ 73 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 48.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 308 పరుగులు చేసి, ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. జాసన్ రాయ్ 151 బంతులు ఎదుర్కొని, 16 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు. జో రూట్ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.