క్రీడాభూమి

కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 16: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాచ్‌లో 25 శాతం కోత పడింది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు సోమవారం జరిగిన ఆట సందర్భంగా కోహ్లీ ఐసీసీ కోడ్ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. మూడవ రోజు ఆట సందర్భంగా రెండవ రోజు 25వ ఓవర్‌లో కోహ్లీ ఎంపైర్ మిచెల్ కాఫ్‌తో అదే పనిగా వాదనకు దిగిన నేపథ్యంలో ఐసీసీ కోడ్ లెవెల్ 1ను అనుసరించి అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించినట్టు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మ్యాచ్‌లో కొహ్లీ వ్యవహరించిన తీరు ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ 2.1.1 ఆర్టికల్ ప్రకారం నియమ నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని పేర్కొంది. కోహ్లీ తీరు మిగతా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఉందని పేర్కొంది. అనంతరం విరాట్ కోహ్లీ తాను చేసిన తప్పునకు ఐసీసీ మ్యాచ్ రిఫరీలు మిచైల్ కాఫ్, పాల్ రీఫిల్, ధర్డ్ ఎంపైర్ రిచర్డ్ కెటిల్ బారో, ఫోర్త్ ఎంపైర్ అల్లాహుదీన్‌లకు క్షమాపణలు కోరాడు.