క్రీడాభూమి

జపాన్‌తో నేడు తలపడనున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తౌరంగ (న్యూజిలాండ్), జనవరి 16: నాలుగు జాతీయ ఇన్విటేషనల్ టోర్నమెంట్లలో భాగంగా భారత్ హాకీ జట్టు తొలిరోజు బుధవారంనాడు జపాన్ జట్టుతో తలపడుతుంది. జపాన్‌తో జరిగిన పోటీ అనంతరం బెల్జియం, న్యూజిలాండ్‌తో జరిగే ఐదు రోజుల సిరీస్‌లలో భారత్ ఆడుతుంది. నాలుగు రోజులపాటు జపాన్‌తో జరిగే పోటీలో భాగంగా భారత్ ఇక్కడి బ్లేక్ పార్క్‌లో వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది. భారత్ జట్టు కెప్టెన్ రూపేంద్రపాల్ సింగ్ స్టేడియంను పరిశీలించి, ఇది తమకు అన్నివిధాల అనుకూలంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ పిచ్‌పై తమ జట్టు బాగా ఆడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ కొత్త ఏడాదిలో భారత జట్టు ఇదే తొలి టోర్నమెంట్ అని, కనుక కొన్ని మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా ఆ మధుర క్షణాలతో మళ్లీ స్వదేశానికి తిరిగి వెళ్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. ఇదిలావుండగా, జపాన్‌తో గతంలో జరిగిన పలు టోర్నీలో భారత్‌కు మంచి రికార్డు ఉందన్న విషయం గత ఏడాది ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరిగిన పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్‌లో రుజువైంది. ఈ టోర్నీలో భారత్ 5-1 తేడాతో జపాన్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో నాలుగు జాతీయ ఇన్విటేషన్ టోర్నమెంట్లలో కూడా బాగా ఆడతామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశాడు. తమ జట్టులోకి శ్రీజేష్ మళ్లీ రావడంతో, అతని అనుభవం టోర్నీలో పెద్ద జట్లతో ఆడినపుడు తమకు సానుకూలంగా ఉండగలదని ఆయన అన్నాడు. గాయం తర్వాత కోలుకున్న తర్వాత బెల్జియం, న్యూజిలాండ్ వంటి జట్లతో ఆడేందుకు తాను ఎంతో ఉత్సుకత చూపిస్తున్నానని ఆయన పేర్కొన్నాడు.