క్రీడాభూమి

జొకోవిచ్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 18: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మాజీ నంబర్ వన్, సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్ చేరాడు. రెండు గంటల, 45 నిమిషాలు సాగిన పోరులో అతను గేల్ మోన్ఫిల్స్‌ను 4-6, 6-3, 6-1, 6-3 తేడాతో ఓడించాడు. డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ వంటి స్టార్లు నాలుగో రోజు బరిలో ఉన్నప్పటికీ, జొకోవిచ్ స్టార్ అట్రాక్షన్‌గా మారాడు. గతంలో ఆరు పర్యాయాలు ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకున్న అతను మోచేతి నొప్పి కారణంగా సుమారు ఆరు నెలల పాటు టెన్నిస్‌కు దూరమైన అతను పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అన్న ప్రశ్న అభిమానులను తీవ్రంగా వేధిస్తున్నది. ఈ కారణంగానే అతని మ్యాచ్‌ని తిలకించేందుకు ప్రేక్షకులు పోటెత్తారు. రెండో రౌండ్ ఆరంభంలో తడబాటును ప్రదర్శించిన అతను మొదటి సెట్‌ను కోల్పోయినప్పుడు, అభిమానుల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అయితే, మిగతా మూడు సెట్లను గెల్చుకొని అతను మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. పదేళ్ల క్రితం మొదటిసారి ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచిన అతను ఈసారి ఈటోర్నీకి ప్రపంచ 14వ ర్యాంక్ ఆటగాడిగా బరిలోకి దిగడం విచిత్రం. గత పదేళ్ల కాలంలో అతను ర్యాంకింగ్స్‌లో ఎన్నడూ ఇంత తక్కువ స్థాయికి పడిపోలేదు. అందుకే, అతని మ్యాచ్‌కే అభిమానులు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
ఫెదరర్ ముందడుగు
డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో అతను జాన్ లెనార్డ్ స్ట్ఫ్‌న్రు 6-4, 6-4, 7-6 తేడాతో ఓడించాడు. మొదటి రెండు సెట్లలోనూ పెద్దగా కష్టపడకుండానే గెలిచిన ఫెదరర్‌కు మూడో సెట్‌లో గట్టిపోటీ ఎదురైంది. అయితే, అంతర్జాతీయ వేదికలపై అపారమైన అనుభవం ఉన్న అతను ఆ సెట్‌ను కూడా గెల్చుకొని, మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడినప్పటికీ, ప్రపంచ ఐదో ర్యాంక్ ఆటగాడు డామినిక్ థియేమ్ రెండో రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేయగలిగాడు. నాలుగో ర్యాంక్ ఆటగాడు, అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-1, 6-3, 4-6, 6-3 స్కోరుతో పీటర్ గొజొవిచ్‌పై గెలిచాడు. క్వాలిఫయర్ డెనిస్ కుడియాతో జరిగిన మారథాన్ మ్యాచ్‌ని అతను 6-7, 3-6, 6-3, 6-2, 6-3 ఆధిక్యంతో గెల్చుకున్నాడు. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ జువాన్ మార్టిన్ డెల్ పొట్రో 6-4, 7-6, 6-7, 6-4 తేడాతో కరెన్ కాచనోవ్‌పై విజయం సాధించాడు.
వావ్రిన్కా నిష్క్రమణ
ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో టెనిస్ సాండ్‌గ్రెన్‌తో జరిగిన పోరులో అతను 2-6, 1-6, 4-6 తేడాతో వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూశాడు.

చిత్రం..జొకోవిచ్