క్రీడాభూమి

జింబాబ్వేపై లంక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జనవరి 21: మూడు దేశాలు పదోటీపడుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ని శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 198 పరుగులకే ఆలౌట్‌కాగా, ఆ లక్ష్యాన్ని శ్రీలంక 44.5 ఓవర్లలోనే, కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలన్న లక్ష్యంతో బ్యాటింగ్‌ను ఎంచుకున్న జింబాబ్వే కెప్టెన్ గ్రేమ్ క్రెమర్ అంచనాలు తారుమారయ్యాయి. లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో జింబాబ్వేకు భారీ స్కోరు సాధ్యం కాలేదు. మిడిల్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ బ్రెండన్ కేలర్ (80 బంతుల్లో 58 పరుగులు) అర్ధ శతకాన్ని సాధించి, జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ క్రెమర్ 34, మాల్కం వాలర్ 24 చొప్పున పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఆ మాత్రం స్కోర్లు చేయలేకపోవడంతో, జింబాబ్వే ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే, 198 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో తిసర పెరెరా 33 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. నువాన్ ప్రదీప్ 25 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. లక్షన్ సండాకన్ 57 పరుగులకు రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే నిర్దేశించిన అత్యంత సామాన్యమైన 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 33 పరుగులు వద్ద ఓపెనర్ ఉపుల్ తరంగ (17) వికెట్‌ను కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ కుశాల్ పెరెరా క్రీజ్‌లో నిలదొక్కుకొని, లంక స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. అతను 49 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ర్యాన్ ముర్రే క్యాచ్ పట్టగా, బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. నిరోషన్ డిక్‌విల్లా (7), ఆసెల గుణరత్నే (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరగా, కుశాల్ మేండిస్ 36 పరుగులు సాధించాడు. చివరిలో కెప్టెన్ దినేష్ చండీమల్ (38 నాటౌట్), తిసర పెరెరా (39 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ లంకకు ఇంకా 31 బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.