క్రీడాభూమి

బట్లర్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 21: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో వనే్డను 16 పరుగుల తేడాతో గెల్చుకొని, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. దీనితో మగతా రెండు వనే్డలకు ప్రాధాన్యం లేకుండాపోయింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జొస్ బట్లర్ సెంచరీతో కదంతొక్కడంతో, ఆస్ట్రేలియా ముందు ఇంగ్లాండ్ 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం లక్ష్య సాధనలో విఫలమైన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 286 పరుగులు చేయగలిగింది. దీనికి ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌ను 4-0 తేడాతో సాధించిన ఆస్ట్రేలియా, అదే ఊపును ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లోనూ కొనసాగిస్తుందని అభిమానులు ఆశించారు. అయితే, ఆస్ట్రేలియా దీనికి పూర్తి భిన్నంగా ఆడి, మొదటి రెండు వనే్డలను చేజార్చుకుంది. గెలిస్తే తప్ప, సిరీస్‌పై ఆశలను నిలబెట్టుకునే అవకాశం లేని పరిస్థితుల్లో మూడో వనే్డకు సిద్ధమైంది. అయితే, యాషెస్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్ కొనసాగించిన ఎదురుదాడికి నిలవలేక మరోసారి దాసోహమై, 16 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. సిరీస్‌ను 0-3 తేడాతో ఇంగ్లాండ్‌కు అప్పగించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 302 పరుగులు సాధించింది. జొస్ బట్లర్ 83 బంతుల్లో, సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 39, జో రూట్ 27, ఇయాన్ మోర్గాన్ 41, క్రిస్ వోక్స్ 53 (నాటౌట్) చొప్పున పరుగులు చేసి, ఇంగ్లాండ్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. జొష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్, ఆడం జంపా, మిచెల్ మార్క్ తలా ఒక్కో వికెట్ కూల్చారు. కాగా, సిరీస్‌పైశలు నిలబెట్టుకోవడానికి 303 పరుగులను ఛేదించాల్సిన ఆస్ట్రేలియా సమర్థంగా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పరుగుల వేటలో విఫలమై, 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 286 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ ఉడ్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ తలా రెండేసి వికెట్లు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 6 వికెట్లకు 302 (జానీ బెయిర్‌స్టో 39, జో రూట్ 27, ఇయాన్ మోర్గాన్ 41, జొస్ బట్లర్ 100 నాటౌట్, క్రిస్ వోక్స్ 53 నాటౌట్, జొష్ హాజెల్‌వుడ్ 2/58).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 (ఆరోన్ ఫించ్ 62, స్టీవెన్ స్మిత్ 45, మిచెల్ మార్ష్ 55, మార్కస్ స్టోయినిస్ 56, టిమ్ పైన్ 31 నాటౌట్, మార్క్ ఉడ్ 2/46, క్రిస్ వోక్స్ 2/57, అదిల్ రషీద్ 2/51).

చిత్రం..జొస్ బట్లర్