క్రీడాభూమి

సియెట్‌తో హర్మన్‌ప్రీత్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: అసాధారణ నైపుణ్యంతో భారత జట్టును గత ఏడాది జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వరల్డ్ కప్‌లో ఫైనల్ చేర్చిన మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సియెట్‌తో బ్యాట్ ఎండార్స్‌మెంట్‌పై సంతకం చేసింది. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. సియెట్‌తో ఆమె కాంట్రాక్టు రెండేళ్లు ఉంటుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ సియెట్ బ్యాట్ ఎండార్స్‌మెంట్‌పై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన హర్మన్‌ప్రీత్ కూడా చేరింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి రెండేళ్లపాటు అన్ని ఫార్మాట్స్‌లో, ప్రతి మ్యాచ్‌లోనూ ఆమె సియెట్ స్పాన్సర్‌షిప్‌ను గుర్తు చేసే రీతిలో, ఆ సంస్థ స్టికర్ అంటించిన బ్యాట్లనే ఉపయోగించాల్సి ఉంటుంది. అటు టెస్టుల్లో, ఇటు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో నిలకడగా రాణిస్తున్న హర్మన్‌ప్రీత్ భారత క్రికెట్ జట్టులో కీలక భూమిక పోషిస్తున్నది.