క్రీడాభూమి

లాయిడ్ పోప్ అద్భుత ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్ల్యుసి క్వీన్‌స్టన్, జనవరి 23: ఇక్కడ జరుగుతున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన ఈ పోటీలో ఆస్ట్రేలియా స్పిన్నర్ లాయిడ్ పోప్ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. టోర్నీలో 35 పరుగులిచ్చి 8 వికెట్లు తీసుకోవడం ద్వారా జట్టును సెమీ ఫైనల్‌లో తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. 18 లోయిడ్ పోప్ తన అత్యుత్తమ ఆటతీరుతో జట్టు కెప్టెన్ జోసన్ రాల్‌స్టోన్ సహా సహచర సభ్యుల అభినందనలు అందుకున్నాడు.
సెమీ ఫైనల్‌లోకి ఆస్ట్రేలియా
లెగ్‌స్పిన్నర్ లాయిడ్ పోప్ అద్భుత ఆట తీరుతో ఇక్కడ జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన పోటీలో ఆస్ట్రేలియా లెగ్‌స్పిన్నర్ లాయిడ్ పోప్ 35 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. కేవలం 23.4 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ ప్రతిఘటన ఇవ్వలేక చతికిలపడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ జాసన్ సంగా అత్యధికంగా 58 పరుగులు చేశాడు. గురువారం న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ మధ్య క్వార్టర్ ఫైనల్‌లో గెలుపొందే జట్టుతో ఈనెల 29న క్రిస్ట్‌చర్చ్‌లో జరిగే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లో తలపడుతుంది.