క్రీడాభూమి

పీఎం ఎలెవెన్ జట్టు కెప్టెన్‌గా నాథన్ లియాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 23: కాన్‌బెరాలో వచ్చేనెలలో ఇంగ్లాండ్‌తో జరిగే ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ టీ-20లో ఆడే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్పిన్నర్ నాథన్ లియాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెష్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0 తేడాతో విజయం సాధించడంలో లియాన్ ప్రముఖ పాత్ర వహించాడు. ఐదు మ్యాచ్ ఈ సిరీస్‌లో లియాన్ 21 వికెట్లు తీసుకున్నాడు. కెరీర్‌లో అతను ఇంతవరకు 290 టెస్టు వికెట్లు తీసి, విజయవంతమైన ఆఫ్‌స్పిన్నర్‌గా ఖ్యాతి గడించాడు. కాగా, కెప్టెన్‌గా లియాన్ అన్ని అర్హతలు కలిగినవాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. గతంలో కెప్టెన్లు వ్యవహరించిన బ్రెట్ లీ, మైఖేల్ హస్సీ, రికీ పాంటింగ్ సరసన నాథన్ లియాన్ చేరుతాడని తెలిపింది.