క్రీడాభూమి

ఫెడ్ కప్‌తో మళ్లీ రంగంలోకి సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 24: గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సత్తా చాటుకున్నాక మరే ఇతర పోటీల్లోనూ కనిపించని ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వచ్చే నెలలో జరిగే ఫెడ్ కప్ టోర్నీకి హాజరవుతోంది. ఈ విషయాన్ని అమెరికా టెన్నిస్ సంఘం ప్రకటించింది. గత ఏడాది జనవరిలో మెల్బోర్న్‌లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచినపుడు ఆమె గర్భవతి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత ఆమె అలెక్స్ ఒహానియన్‌ను నవంబర్‌లో వివాహం చేసుకుంది. ఫెడ్ కప్ ప్రస్తుత చాంపియన్లుగా ఉన్న అమెరికా క్రీడాకారులు ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చే నెథర్లాండ్స్‌తో ఫిబ్రవరి 10-11 తేదీల్లో తలపడనున్నారు. సెరెనాతో పాటు ఆమె సోదరి వీనస్ విలియమ్స్, కొకొ వండెగ్వె పోటీలకు హాజరవుతున్నారు. గత రెండేళ్లలో అమెరికా తరఫున విలియమ్స్ సోదరీమణులు ఆడడం ఇదే తొలిసారి. ఈ ఇద్దరూ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఎప్పుడూ అమెరికాకు ఓటమి ఎదురుకాలేదు. సెరెనా ఆఖరి సారిగా 2015లో ఫెడ్ కప్‌లో పాల్గొని, మళ్లీ ఇన్నాళ్లకు ఆ పోటీలకు సన్నద్ధం అవుతోంది. ఆమె సోదరి వీనస్ 2016 ఫెడ్ కప్‌లో పాల్గొంది. గత ఏడాది ఫెడ్ కప్‌లో ఆడిన మరో క్రీడాకారిణి వెండెగ్వే వచ్చే నెలలో పోటీకి హాజరవుతోంది.