క్రీడాభూమి

చెలరేగిన ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 24: 14వ ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోగర్ ఫెదరర్ చెలరేగిపోయాడు. సుదీర్ఘకాల ప్రత్యర్థి థామస్ బెర్డిక్‌ను వరుస సెట్లతో మట్టికరిపించాడు, ఫైనల్ దిశగా దూసుకెళ్లాడు. రాడ్ లావెర్ అరీనా కోర్టులో 2గంటల 14 నిమిషాలపాటు అలుపెరుగని పోరాటాన్ని ప్రదర్శించిన ఫెదరర్, సెకెండ్ సీడ్ ఆటగాడైన బెర్డిక్‌పై 7-6 (7/1), 6-3, 6-4 స్కోరుతో విజయం సాధించాడు. ఇక ఫైనల్‌లో చోటుకోసం అన్‌సీడెడ్ సౌత్ కొరియన్ ఆటగాడు చుంగ్ హ్యూన్‌తో శుక్రవారం తలపడాల్సి ఉంది. 19సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ అయిన ఫెదరర్ మెల్‌బోర్న్‌లో ఐదుసార్లు బెర్డిక్‌తో తలపడినా, ఏ ఒక్కసారీ ఓటమి చవిచూడలేదు. బుధవారంనాటి విజయంతో 1968 తరువాత టెన్నిస్ చరిత్రలో 43సార్లు గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్‌కు చేరిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించటం విశేషం. ‘అన్ని సెట్లలోనూ రాణించి విజయం సాధించటం చాలా సంతోషంగా ఉంది.
ఈ మ్యాచ్‌లో ముగింపే నాకు కీలకం’ అని కోర్టులోనే ఫెదరర్ వ్యాఖ్యానించాడు. ‘ముఖ్యంగా మొదటి రెండు సెట్లలో థామస్ అద్భుతంగా రాణించాడు. మూడో సెట్‌లో ఆయన ఆట తీరు ఒకింత బలహీనపడింది. నిజానికి మొదటి సెట్‌లో గెలుపు నాకు కష్టం అనిపించింది’ అని ఫెదరర్ అన్నాడు. ‘నేను అతని కోర్టులోకి పంపే ప్రతి బంతినీ అంతకుమించిన వేగంతో నావైపునకు పంపడం చూస్తే, థామస్ ఎంత పటిష్టమైన డిఫెన్స్‌ను ప్రదర్శించాడో అర్థమైంది. థామస్‌తో ఆడటం నాకు చాలా సంతృప్తినిచ్చింది’ అన్నాడు. ఇప్పటి వరకూ మెల్‌బోర్న్‌లో ఆడిన 14 క్వార్టర్ ఫైనల్స్‌లోనూ ఫెదరర్ విజయం సాధించి కూడా రికార్డు సృష్టించాడు.