క్రీడాభూమి

స్కూల్ గేమ్స్‌కు 3,298 మంది అథ్లెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: షూటింగ్‌లో ఇన్‌డోర్ వరల్డ్ జూనియర్ చాంపియన్ అనీష్ భన్వాలా, ప్రపంచ యూత్ వెట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించిన జెరెమీ లాల్‌రినున్గా సహా మొత్తం 3,298 మంది అథ్లెట్లు ఈసారి ‘ఖేల్ ఇండియా స్కూల్ గేమ్స్’లో పోటీపడుతున్నారు. ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అథ్లెట్లు హాజరవుతారు. అదే విధంగా కోచ్‌లు, సపోర్టింగ్ స్ట్ఫా 1,154 మంది కూడా ఈ పోటీల్లో ఉంటారు. స్కూల్ గేమ్స్‌లో ఇంత భారీ సంఖ్యలో అథ్లెట్లు, అధికారులు గతంలో ఎన్నడూ హాజరుకాలేదు.