క్రీడాభూమి

పేసర్ ఎంగిడికి మంచి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్సస్‌బర్గ్, జనవరి 25: దక్షిణాఫ్రికా పేసర్, యువ సంచలన ఆటగాడు లుంగీ ఎంగిడి ఇటీవల కాలంలో చూపిన ప్రతిభా సామర్థ్యాలు ప్రదర్శించినందుకు ఇప్పటికే అన్నివర్గాల ప్రశంసలు అందుకున్నందుకు అరుదైన అవకాశం లభించింది. డర్బన్‌లో ఫిబ్రవరి 1వ తేదీ నుండి భారత్‌తో జరుగబోయే ఆరో వండే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు అవకాశం లభించింది. ఈ 21 ఏళ్ల ఆటగాడు సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 90 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీయడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా గతంలో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఎంగిడి ఆడలేదు. గాయాల కారణంగా వండే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న జట్టు పేసర్ మోర్నె మోర్కల్, ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ కూడా వచ్చేనెలలో జరుగబోయే 15 మంది జట్టు సభ్యుల్లో ఉన్నారు.