క్రీడాభూమి

బుమ్రా మాయాజాల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్సస్‌బర్గ్, జనవరి 25: న్యూ వాండరర్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసిన భారత్ తమ ప్రత్యర్థి జట్టు బుధవారం ఆట ముగిసే ప్రథమార్థంలోనే ఒక వికెట్ తీసింది. 188 పరుగుల లక్ష్యఛేదనకు రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 65.5 ఓవర్లలో 194 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై తన తొలి ఇన్నింగ్స్‌లో ఈ జట్టు 7 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్‌కు ధీటుగా సమాధానం ఇవ్వాలనుకున్న ప్రత్యర్థి జట్టు అనుకున్నంత ఎక్కువ స్కోరు చేయలేకపోయింది.
మూడో టెస్టు మ్యాచ్‌లోకి అనూహ్యంగా వచ్చిన భారత్ పేసర్ బుమ్రా 18.5 ఓవర్లలో 54 పరుగులకు ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. బుమ్రాకు తానేమీ తీసిపోనంటూ భువనేశ్వర్ కుమార్ 19 ఓవర్లలో 44 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. కగిడో రబడ సహకారంతో హసీం ఆమ్లా 121 బంతులు ఎదుర్కొని ఆ జట్టులో అత్యధికంగా 61 పరుగులు చేశాడు. జట్టులో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆడెన్ మార్కమ్ 8 పరుగులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి డీన్ ఎల్గర్ 18 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేయగా, కసిసో 10 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. బుధవారం రాత్రి వరకు ఆరు ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా రెండోరోజు ఓవర్‌నైట్ ఆటను గురువారం ప్రారంభించింది. డీన్ ఎల్గర్ 40 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి భువనేశ్వర్‌కుమార్ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కగిసో రబడ 84 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లతో 30 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రహానేకు క్యాచి ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. హషీమ్ ఆమ్లా 121 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లతో 61 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో హార్థిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఆమ్లా ఒక్కడే అత్యధిక పరుగులు చేయడం గమనార్హం. ఏబీ డివిలియర్స్ 19 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ 19 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసి బుమ్రాకు దొరికిపోయాడు. వైస్‌కెప్టెన్ క్వింటన్ డికాక్ 22 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు క్యాచి ఇచ్చాడు. ఫిలాండర్ వెర్నన్ 55 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సహాయంతో 35 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆండిల్ ఫెల్‌క్యావో 17 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 9 పరుగులు చేయగా అతనిని బుమ్రా ఎల్‌బీడబ్ల్యు చేశాడు. లుంగిసాని ఎంగిడి రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే బుమ్రా బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మోర్నె మోర్కల్ 8 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా జట్టులో హషీమ్ ఆమ్లా ఒక్కడే అత్యధికంగా 61 పరుగులు చేయగా, వెర్నన్ ఫిలాండర్ 35 పరుగులు, కగిసో రబడ 30 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లెవరూ కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. భారత్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా 54 పరులిచ్చి ఐదు వికెట్లు చేజిక్కించుకోగా భువనేశ్వర్ కుమార్ 44 పరుగులిచ్చి మూడు వికెట్టు పడగొట్టాడు.
వికెట్ల పతనం: 3-1 (ఎయిడెన్ మర్క్రమ్, 2.3), 16-2 (డీన్ ఎల్గర్, 12.3), 80-3 (కగిసో రబడ, 29.6), 92-4 (ఏబీ డివిలియర్స్, 36.4), 107-5 (్ఫఫ్ డుప్లెసిస్, 41.4), 125.6 (క్వింటన్ డికాక్, 47.2), 169-7 (హసీమ్ ఆమ్లా, 59.5), 175-8 (వెర్నన్ ఫిలాండర్, 62.2), 194-9 (ఆండిల్ ఫెల్‌క్వావో, 65.3), 194-10 (లుంగిసాని ఎంగిడి, 65.5).
ఎక్స్‌ట్రాలు: ఎల్‌బీడబ్ల్యు-14, డబ్ల్యు-9) 23 (మొత్తం 65.5 ఓవర్లలో 194.
బౌలింగ్: జస్ప్రీత్ బుమ్రా 18.5-2-54-5, భువనేశ్వర్‌కుమార్ 19-9-44-3, ఇషాంత్ శర్మ 14-2-33-1, మహ్మద్ షమీ 12-0-46-1.
భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం
దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ 65.5 ఓవర్లలో 194 పరుగులు చేయగా, అనంతరం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ప్రత్యర్థి జట్టుపై 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే (4.6) పార్థివ్ పటేల్ వికెట్‌ను కోల్పోయింది. 15 బంతులు ఎదుర్కొన్న పార్థివ్ మూడు ఫోర్లతో 16 పరుగులు చేసి ఫిలాండర్ బౌలింగ్‌లో మక్రంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి, ఆట ముగిసే సమయానికి భారత్ 49 పరుగులు చేసింది. మురళీ విజయ్ 49 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 13 పరుగులతోను, లోకేష్ రాహల్ 38 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సహాయంతో 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వెర్నర్ ఫిలాండర్ 5 ఓవర్లలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు.

చిత్రం..దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఆనందంలో జప్రీత్ బుమ్రావెస్టిండీస్ ఆల్‌రౌండర్