క్రీడాభూమి

బ్రేవో ఏ జట్టులోకి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: వెస్టిండిస్ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లలో 106 మ్యాచ్‌లలో తన ఆటతీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకుని, ఆయా జట్లకు మంచి పేరుప్రతిష్టలు తీసుకువచ్చిన డ్వేన్ బ్రేవో ఇపుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. రానున్న ఐపీఎల్ టోర్నీలలో అతనిని ఏ ఫ్రాంచైజీ చేజిక్కించుకుంటుదన్నది కొద్దిరోజుల్లోనే తేటతెల్లం కానుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా వినుతికెక్కిన బ్రేవో ఐపీఎల్ టోర్నీలతో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. 2008 సంవత్సరం నుండి ఐపీఎల్‌లలో ఆడుతున్న బ్రేవో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్లతో ఎన్నో మ్యాచ్‌లలో ఆడి ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటాడు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన లెక్కకుమించి టీ-20 మ్యాచ్‌లలో సైతం ఆడిన బ్రేవో తన ఆటతీరులో కొత్త టెక్నిక్‌లతో అవలంబిస్తూ వస్తున్నాడు.
ఇప్పటివరకు 106 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడిన ఆయన 100 వికెట్లు తీసి, 125.94 స్రైటింగ్ రేట్‌తో 1238 పరుగులు సాధించాడు. అత్యుత్తమ బౌలర్‌గా అత్యధికంగా 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్న సందర్భం కూడా ఉంది. ఈ 34 ఏళ్ల కరేబియన్ ఆటగాడు జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నపుడు వికెట్లు పడగొట్టి ఆదుకుని ప్రశంసలు అందుకునేవాడు. బ్రేవో ఖాతాలో ఇప్పవరకు నాలుగు అర్ధసెంచరీలు సైతం ఉన్నాయి. ఇతని అత్యధిక స్కోరు 70 నాటౌట్. 2103లో 32 వికెట్లు తీయడం ద్వారా విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఘనత సాధించాడు. అయితే, త్వరలో జరిగే ఐపీఎల్‌లో బ్రేవోను ఏ ఫ్రాంచైజీ దక్కించుకోనున్నదన్న విషయం కొద్దిరోజుల్లోనే తేటతెల్లం కానుంది.