క్రీడాభూమి

ట్రావిస్ సెంచరీ మిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, జనవరి 26: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయినప్పటికీ, శుక్రవారం నాటి నాలుగో మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో గెల్చుకొని, క్లీన్‌స్వీప్ ప్రమాదం నుంచి బయటపడిన ఆస్ట్రేలియా పరువు నిలబెట్టుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 96 పరుగులు సాధించి, ఆస్ట్రేలియా విజయంలో కీలక భూమిక పోషించిన ట్రావిస్ హెడ్ దురదృష్టవశాత్తు నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్‌లో ముగ్గురు, మొత్తం మీద నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. ఓపెనర్లు జాసన్ రాయ్ రెండు బంతులు, జానీ బెయిర్‌స్టో 9 బంతులు ఎదుర్కొన్నప్పటికీ, పరుగుల ఖాతాను తెరవలేదు. ఫస్ట్‌డౌన్ ఆటగాడు అలెక్స్ హాలెస్ 11 బంతుల్లో అతి కష్టం మీద 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ ఏడు బంతులు ఎదుర్కొన్నా ఒక్క పరుగు కూడా చేయలేదు. అదే విధంగా వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జొస్ బట్లర్ కూడా డకౌటయ్యాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33), మోయిన్ అలీ (33) కొంత వరకు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో చేశారు. చివరిలో క్రిస్ వోక్స్ ఒంటరి పోరాటం జరిపి, 82 బంతుల్లో 78 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి టామ్ కూరన్ (35) అండగా నిలవడంతో ఇంగ్లాండ్ 196 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ 24 పరుగులకే 4 వికెట్లు సాధించి, ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్లు ఇద్దరినీ ఔట్ చేసిన జొష్ హాజెల్‌వుడ్ మొత్తం మీద 39 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఆండ్రూ టై 33 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు.
ఆస్ట్రేలియా 25 పరుగుల వద్ద స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ (13) వికెట్‌ను కోల్పోయింది. కామరాన్ వైట్ (3), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (4) కూడా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కష్టాల్లో పడిన ఆసీస్‌కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ అండగా నిలిచాడు. అతని పోరాటమే ఆసీస్‌ను విజయం దిశగా నడిపించింది. మిచెల్ మార్ష్ 30 బంతుల్లోనే 32 పరుగులు చేసి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని భాగస్వామ్యంలో నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించిన ట్రావిస్ ఆతర్వాత మాస్కర్ స్టొయినిస్ (14)తో కలిసి స్కోరును 136 పరుగులకు చేర్చాడు. అనంతరం వికెట్‌కీపర్ టిమ్ పైన్ సహకారంలో జట్టును విజయానికి చేరువకు తెచ్చాడు. జట్టు స్కో 180 పరుగుల వద్ద మార్క్ ఉడ్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ క్యాచ్ పట్టగా ఔటైన ట్రావిస్ 107 బంతులు ఎదుర్కొని, 96 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 15 ఫోర్లు ఉన్నాయి. పాక్ కమిన్స్ 3 పరుగులకే వెనుదిరగ్గా, ఆస్ట్రేలియా 37 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులతో విజయాన్ని నమోదు చేసింది. అప్పటికి పైన్ 24, ఆండ్రూ టై 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్‌కు అత్యధికంగా మూడు వికెట్లు లభించాయి. క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్, టామ్ కూరన్ తలా ఒక్కో వికెట్ సాధించారు. కాగా, ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో వనే్డ పెర్త్‌లో ఆదివారం జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 44.5 ఓవర్లలో 196 ఆలౌట్ (ఇయాన్ మోర్గాన్ 33, మోయిన్ అలీ 33, క్రిస్ వోక్స్78, టామ్ కూరన్ 35, పాట్ కమిన్స్ 4/24, ఆండ్రూ టై 3/33, జొష్ హాజెల్‌వుడ్ 3/39).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 37 ఓవర్లలో 7 వికెట్లకు 197 (ట్రావిస్ హెడ్ 96, మిచెల్ మార్ష్ 32, టిమ్ పైన్ 25 నాటౌట్, అదిల్ రషీద్ 3/49, క్రిస్ వోక్స్ 1/36, మార్క్ ఉడ్ 1/58, టామ్ కూరన్ 1/10).