క్రీడాభూమి

ఎవరు హీరోలో.. ఎవరు జీరోలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హడావుడి మళ్లీ మొదలైంది. శని, ఆది వారాల్లో జరిగే ఈ ఏడాది వేలంలో ఎంత మంది క్రికెటర్లకు అవకాశం లభిస్తుందో, ఎంత మందికి నిరాశ తప్పదోనన్న విషయం ఆసక్తిని రేపుతున్నది. 11వ ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడానికి మొత్తం 1,122 మంది తమ పేర్లను దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఐపీఎల్ పాలక మండలి ఈ జాబితాను పరిశీలించి, వడపోసి, 578 మందిని వేలానికి ఎంపిక చేసింది. వీరిలో 360 మంది భారతీయులు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, గౌతం గంభీర్ వంటి ఒకప్పటి స్టార్లు వేలానికి రానున్నారు. వీరితోపాటు అశ్విన్, శిఖర్ ధావన్, ఫఫ్ డుప్లెసిస్, క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, అజింక్య రహానే, మిచెల్ స్టార్క్, బెన్ స్టోక్స్, డ్వెయిన్ బ్రేవో, షకీబ్ అల్ హసన్ తదితర స్టార్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఆస్ట్రేలియా పేసర్ గ్లేన్ మాక్స్‌వెల్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ తదితరులు కూడా వేలం జాబితాలో ఉన్నారు. చాలా మంది పేరున్న క్రికెటర్లతోపాటు యువ ఆటగాళ్లు కూడా పోటీపడుతున్న నేపథ్యంలో, రెండు రోజులు జరిగే వేలంలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి.