క్రీడాభూమి

టైటిల్ చేరువలో బొపన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తిమియా బబోస్‌తో కలిసి ఆడుతున్న భారత సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్న ఫైనల్ చేరాడు. గత ఏడాది గాబ్రియెల డ్రబోవ్‌స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను బొపన్న కైవసం చేసుకున్నాడు. కాగా, ఇక్కడ సెమీ ఫైనల్‌లో బొపన్న, బబోస్ జోడీ 7-5, 10-6 తేడాతో మరియా జోస్ మార్టినెజ్ సాంచెజ్, మార్సెలో డెమోలినర్ జోడీని ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్‌కు చేరువైన బొపన్న, బబోస్ తుది పోరులో గాబ్రియేల డబ్రోవ్‌స్కీ, మేట్ పావిక్ జోడీని ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్ పోరులో డబ్రోవ్‌స్కీ, పావిక్ 6-1, 6-4 ఆధిక్యంతో ఎకతరీన మకరొవా, బ్రూనో సొయెర్స్ జోడీని చిత్తుచేశారు.