క్రీడాభూమి

వామ్మో.. వాండరర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జనవరి 26: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి, మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న జొహానె్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో పిచ్ ప్రమాదకరంగా మారింది. అనూహ్యంగా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ నానా ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు, జస్‌ప్రీత్ బుమ్రా వేసిన బంతి ఎవరూ ఊహించని రీతిలో, మెరుపు వేగంతో పైకి లేచి బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గార్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీనితో ఫిజియో, వైద్యులను అంపైర్లు పిలిపించారు. ఆటను కొనసాగించడం కష్టంగా ఉందని బ్యాట్స్‌మెన్ స్పష్టం చేయడంతో, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా పిలిపించి, చర్చించారు. అనంతరం మూడో రోజు ఆటను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి నిర్ణయం కోసం ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లీ, ఫఫ్ డుప్లెసిస్, ఫీల్డ్ అంపైర్లు ఇయాన్ గౌల్డ్, అలీం దర్, టీవీ అంపైర్ మైఖేల్ గాఫ్‌తో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సమావేశమయ్యాడు. శనివారం ఉదయం పిచ్ తీరును పరిశీలించిన తర్వాత, మ్యాచ్‌ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
అంతకు ముందు జరిగిన ఆటలో, ప్రత్యర్థిపై భారత్ పట్టు బిగించింది. ప్రతి పరుగుకూ ఎంతో కష్టపడాల్సి వస్తున్న వాండరర్స్ స్టేడియం పిచ్‌పై ప్రత్యర్థి ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే పోరాటం భారత్‌ను మెరుగైన స్థితిలో నిలబెట్టింది. కాగా, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి, మూడో రోజు ఆటను అర్ధాంతరంగా నిలిపివేసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది. అయిడెన్ మర్‌క్రామ్ నాలుగు పరుగులు చేసి ఔట్‌కాగా, డీన్ ఎల్గార్ 11, హషీం ఆమ్లా 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
మ్యాచ్ రెండో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి పార్థీవ్ పటేల్ (6) వికెట్ కోల్పోయి 49 పరుగులు చేసిన భారత్ ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఉదయం ఆటను కొనసాగించి, మరో రెండు పరుగులకే లోకేష్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. అతను 16 పరుగులు చేసి, వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్‌లో ఫఫ్ డు ప్లెసిస్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మరో ఆరు పరుగుల తర్వాత చటేశ్వర్ పుజారా కూడా పెవిలియన్ చేరాడు. పది బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఒక పరుగు చేసి, మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో ఫఫ్ డు ప్లెసిస్‌కు చిక్కాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఓపెనర్ మురళీ విజయ్ 127 బంతుల్లో 25 పరుగులు చేసి, కాగిసో రబదా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 100 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో జట్టును ఆదుకునే బాధ్యత కోహ్లీ, రహానేపై పడింది. 79 బంతుల్లో, ఆరు ఫోర్లతో 41 పరుగులు చేసిన కోహ్లీని కాగిసో రబదా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 23 బంతులు ఎదుర్కొన్నప్పటికీ కేవలం నాలుగు పరుగులు చేసి, కాగిసో రబదా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బాధ్యతాయుతంగా ఆడిన రహానే 68 బంతుల్లో 48 పరుగులు సాధించి, క్వింటన్ డికాక్ క్యాచ్ అందుకోగా, మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అతని స్కోరులో ఆరు ఫోర్లు ఉన్నాయి. భారత్ 203 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టిన మహమ్మద్ షమీ 28 బంతుల్లో 27 పరుగులు చేసి, లున్గీ ఎగ్నిడి బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 13 బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతాను తెరవలేకపోయిన జస్‌ప్రీత్ బుమ్రాను కాగిసో రబదా క్యాచ్ పట్టగా, వెర్నన్ ఫిలాండర్ చేయడంతో, 80.1 ఓవర్లలో 247 పరుగులకు భారత్ ఆలౌటైంది. అప్పటికి ఇశాంత్ శర్మ ఏడు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబదా, మోర్న్ మోర్కెల్, వెర్నర్ ఫిలాండర్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. లున్గీ ఎగ్నిడికి ఒక వికెట్ లభించింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 77 ఓవర్లలో 187 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 50, విరాట్ కోహ్లీ 54, భువనేశ్వర్ కుమార్ 30, కాగిసో రబదా 3/39, మోర్న్ మోర్కెల్ 2/47, వెర్నన్ ఫిలాండర్ 2/31).
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 65.5 ఓవర్లలో 194 ఆలౌట్ (హషీం ఆమ్లా 61, వెర్నర్ ఫిలాండర్ 35, కాగిసో రబదా 30, జస్‌ప్రీత్ బుమ్రా 5/54, భువనేశ్వర్ కుమార్ 3/44).
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 49): మురళీ విజయ్ బి కాగిసో రబదా 25, పార్థీవ్ పటేల్ సి అయిడెన్ మర్‌క్రామ్ బి వెర్నన్ ఫిలాండర్ 16, లోకేష్ రాహుల్ సి ఫప్ డు ప్లెసిస్ బి వెర్నన్ ఫిలాండర్ 16, చటేశ్వర్ పుజారా సి ఫఫ్ డు ప్లెసిస్ బి మోర్న్ మోర్కల్ 1, విరాట్ కోహ్లీ బి కాగిసో రబదా 41, అజింక్య రహానే సి క్వింటన్ డికాక్ బి మోర్న్ మోర్కెల్ 48, హార్దిక్ పాండ్య సి అండ్ బి కాగిసో రబదా 4, భువనేశ్వర్ కుమార్ సి క్వింటన్ డికాక్ బి మోర్న్ మోర్కెల్ 33, మహమ్మద్ షమీ సి ఏబీ డివిలియర్స్ బి లున్గీ ఎగ్నిడి 27, జస్‌ప్రీత్ బుమ్రా సి కాగిసో రబదా బి వెర్నర్ ఫిలాండర్ 0, ఇశాంత్ శర్మ 7 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 29, మొత్తం (80.1 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1-17, 2-51, 3-57, 4-100, 5-134, 6-148, 7-203, 7-238, 9-240, 10-247.
బౌలింగ్: వెర్నర్ ఫిలాండర్ 21.1-5-61-3, కాగిసో రబదా 23-5-69-3, మోర్న్ మోర్కెల్ 21-6-47-3, లున్గీ ఎగ్నిడి 12-2-38-1, అదెల్ ఫెహ్లూక్వాయో 3-0-15-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: అయిడెన్ మర్‌క్రామ్ సి పార్థీవ్ పటేల్ బి మహమ్మద్ షమీ 4, డీన్ ఎల్గార్ 11 నాటౌట్, హషీం ఆమ్లా 2 నాటౌట్, మొత్తం (8.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 17.
వికెట్ల పతనం: 1-5.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-8-0, మహమ్మద్ షమీ 4-1-7-1, జస్‌ప్రీత్ బుమ్రా 0.3-0-2-0.

*భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా సేవలు అందిస్తున్న సమయంలో అత్యధికంగా 3,454 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు చేసిన విరాట్ కోహ్లీ ః. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి, మూడో టెస్టు మూడో రోజు ఆటలో అతను 41 పరుగులు సాధించే క్రమంలో ధోనీ రికార్డును అధిగమించి, నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు.