క్రీడాభూమి

భారత్ ఖాతాలో చివరి టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జనవరి 27: దక్షిణాఫ్రికాతో శనివారం ముగిసిన చివరి, మూడో టెస్టును భారత జట్టు 63 పరుగుల తేడాతో గెల్చుకుంది. అయితే, మొదటి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూడడంతో, సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. ప్రమాదకరంగా మారిన వాండరర్స్ పిచ్‌పై ప్రతి పరుగుకూ బ్యాట్స్‌మెన్ తంటాలు పడిన నేపథ్యంలో, 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. డీన్ ఎల్గార్ (86 నాటౌట్), హషీం ఆమ్లా (52) అర్ధ శతకాలు సాధించడంతో ఆ జట్టుకు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. మహమ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికా పతనానికి కారకుడయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాచ్ మూడో రోజు, శుక్రవారం నిర్ణీత ఓవర్లకు ముందే ఆటను నిలిపివేశారు. అప్పటికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. శనివారం ఉదయం వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. బంతి ఏ దిశగా దూసుకొస్తుందో, ఏ విధంగా పైకి ఎగసిపడుతుందో తెలియని పరిస్థితులకు, వర్షం కూడా తోడు కావడంతో, వాండరర్స్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. అయితే, ఆట మొదలైన తర్వాత ఎల్గార్, ఆమ్లా భారత బౌలింగ్‌కు అడ్డునిలిచి, స్కోరును 124 పరుగులకు చేర్చారు. 140 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 52 పరుగులు చేసిన ఆమ్లాను హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా ఇశాంత్ శర్మ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా కష్టిల్లో పడింది. ఒకవైపు ఎల్గార్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్నప్పటికీ, మిగతా వారు అతనికి అండగా నిలవలేకపోయారు. వెర్నన్ ఫిలాండర్ (10) తప్ప ఎవరూ డబుల్ డిజిట్స్‌ను కూడా అందుకోలేకపోవడంతో, 73.3 ఓవర్లలో 177 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. 12.3 ఓవర్లు బౌల్ చేసిన షమీ 28 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా 57 పరుగులకు రెండు, ఇశాంత్ శర్మ 31 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచిన భువనేశ్వర్ కుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వెర్నన్ ఫిలాండర్ స్వీకరించాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 77 ఓవర్లలో 187 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 50, విరాట్ కోహ్లీ 54, భువనేశ్వర్ కుమార్ 30, కాగిసో రబదా 3/39, మోర్న్ మోర్కెల్ 2/47, వెర్నన్ ఫిలాండర్ 2/31).
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 65.5 ఓవర్లలో 194 ఆలౌట్ (హషీం ఆమ్లా 61, వెర్నర్ ఫిలాండర్ 35, కాగిసో రబదా 30, జస్‌ప్రీత్ బుమ్రా 5/54, భువనేశ్వర్ కుమార్ 3/44).
భారత్ రెండో ఇన్నింగ్స్: 80.1 ఓవర్లలో 247 ఆలౌట్ (మురళీ విజయ్ 25, విరాట్ కోహ్లీ 41, అజింక్య రహానే 48, భువనేశ్వర్ కుమార్ 33, మహమ్మద్ షమీ 27, వెర్నర్ ఫిలాండర్ 3/61, కాగిసో రబదా 3/69, మోర్న్ మోర్కెల్ 3/47).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 241, ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 17): అయిడెన్ మర్‌క్రామ్ సి పార్థీవ్ పటేల్ బి మహమ్మద్ షమీ 4, డీన్ ఎల్గార్ 86 నాటౌట్, హషీం ఆమ్లా సి హార్దిక్ పాండ్య బి ఇశాంత్ శర్మ 52, ఏబీ డివిలియర్స్ సి అజింక్య రహానే బి జస్‌ప్రీత్ బుమ్రా 6, ఫఫ్ డు ప్లెసిస్ బి ఇశాంత్ శర్మ 2, క్వింటన్ డికాక్ ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 0, వెర్నన్ ఫిలాండర్ బి మహమ్మద్ షమీ 10, అదిల్ ఫెహ్లుక్వాయో బి మహమ్మద్ షమీ 0, కాగిసో రబదా సి చటేశ్వర్ పుజారా బి భువనేశ్వర్ కుమార్ 0, మోర్న్ మోర్కెల్ బి మహమ్మద్ షమీ 0, లున్గీ ఎన్గిడి సి సబ్‌స్టిట్యూట్ దినేష్ కార్తీక్ బి మహమ్మద్ షమీ 4, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (73.3 ఓవర్లలో ఆలౌట్) 177.
వికెట్ల పతనం: 1-5, 2-124, 3-131, 4-144, 5-145, 6-157, 7-157, 8-160, 9-161, 10-177.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 18-4-39-1, మహమ్మద్ షమీ 12.3-2-28-5, జస్‌ప్రీత్ బుమ్రా 21-3-57-2, ఇశాంత్ శర్మ 16-3-31-2, హార్దిక్ పాండ్య 6-1-15-0.