క్రీడాభూమి

ఐపీఎల్ వేదికగా హవాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పూర్తిగా ఒక వ్యాపారంగా మారిందని, హవాలా లావాదేవీలకు అధికారిక వేదికగా ఉపయోగపడుతున్నదని భారత మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ ఆరోపించాడు. ఈ టోర్నమెంట్ కోవసం జరుగుతున్న వేలంలో భారీ మొత్తాలు చేతులు మారుతున్న విషయాన్ని అతను గుర్తుచేస్తూ, హవాలా వ్యాపారం జోరుసా సాగుతున్నదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లకు కోట్ల రూపాయలు పలకడాన్ని తాను ఎన్నడూ చూడలేదని శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన బేడీ అన్నాడు. ‘ఒక వికెట్‌కు కోటి రూపాయలు, ఒక పరుగుకు 97 లక్షల రూపాయలు ఖర్చు చేయడాన్ని ఎక్కడైనా చూశామా’ అని ప్రశ్నించాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నదో, ఎక్కడికి చేరుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదన్నాడు. విరాట్ కోహ్లీ వంటి ఆటగాడిని 17 కోట్ల రూపాయలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రీటైన్ చేయడంలో తప్పులేదని, అయితే, డ్రస్సింగ్ రూమ్‌లో అతని పక్కనే పది నుంచి 15 కోట్ల రూపాయలు ఖరీదు పలికి ఒక అనామకుడు ఉంటాడాన్ని ఏ విధంగా సమర్ధిస్తామని అన్నాడు. 2013లో చోటు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌ను బేడీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఈ టోర్నమెంట్ పేరుతో హవాలా వ్యాపారం జరుగుతున్నదని అతను అనుమానం వ్యక్తం చేశాడు.
అశ్విన్‌కు పంజాబ్ అండ
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అతని సొంత రాష్టమ్రైన తమిళనాడులోనే చేదు అనుభవం ఎదురైంది. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా వేలంలో అతనిని తప్పక తీసుకుంటుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మొండి చేయి చూపించింది. అయితే, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అతనికి అండా నిలిచింది. 7.6 కోట్ల రూపాయలకు అశ్విన్‌ను కొనింది. ఇలావుంటే, స్టార్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానేను 4 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాను సన్ రైజర్స్ హైదరాబాద్ 5 కోట్ల రూపాయలకు కొన్నాయి. శిఖర్ ధావన్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ 5.20 కోట్ల రూపాయలు వెచ్చించి మరోసారి జట్టులోకి తీసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గౌతం గంభీర్ మరోసారి తన స్వస్థలానికి చేరాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతనికి 2.80 కోట్ల రూపాయలు వెచ్చించింది. హర్భజన్ సింగ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 2 కోట్లు, దినేష్ కార్తీక్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ 7.4 కోట్లు చెల్లించాయి.
మొదటి రోజు వేలానికి వచ్చిన ఆటగాళ్లలో రాబిన్ ఉతప్ప (6.4 కోట్లు), ఇశాంక్ జగ్గీ (20 లక్షలు), పీయూష్ చావ్లా (4.2 కోట్లు), కుల్దీప్ యాదవ్ (5.8 కోట్లు), నితీష్ రాణా (3.4 కోట్లు)తోపాటు మిచెల్ స్టార్క్ (9.4 కోట్లు), క్రిస్ లిన్ (9.6 కోట్లు)ను కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకుంది.
ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కీరన్ పోలార్డ్ (5.4 కోట్లు), ముస్త్ఫాజుర్ రహ్మాన్ (2.2 కోట్లు), పాక్ కమిన్స్ (5.4 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (3.2 కోట్లు), ఇషాన్ కిషన్ (6.2 కోట్లు)ను తీసుకుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ క్రిస్ వోక్స్ (7.4 కోట్లు), బ్రెండన్ మెక్‌కలమ్ (3.6 కోట్లు), క్వింటన్ డి కాక్ (2.8 కోట్లు), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (2.2 కోట్లు), మోయిన్ అలీ (1.7 కోట్లు), యుజువేంద్ర చాహల్ (6 కోట్లు), ఉమేష్ యాదవ్ (4.2 కోట్లు), మానన్ వోహ్రా (1.1 కోట్లు)ను కూడా జట్టులోకి చేర్చుకుంది.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ ఈ వేలం మొదటి రోజున గ్లేన్ మాక్స్‌వెల్ (9 కోట్లు), కొలిన్ మున్రో (1.9 కోట్లు), జాసన్ రాయ్ (1.5 కోట్లు), కాగిసో రబదా (4.2 కోట్లు), మహమ్మద్ షమీ (3 కోట్లు), విజయ్ శంకర్ (3.2 కోట్లు), అమిత్ మిశ్రా (4 కోట్లు), హర్షల్ పటేల్ (20 లక్షలు), రాహుల్ తివాతియా (3 కోట్లు)ను కూడా కొన్నది.
రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి వస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్టువర్ట్ బిన్నీ (50 లక్షలు), సంజూ శాంసన్ (8 కోట్లు), రాహుల్ త్రిపాఠీ (3.4 కోట్లు), డాన్సీ షార్ట్ (4 కోట్లు), జొస్ బట్లర్ (4.4 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (7.2 కోట్లు)ను సైతం జట్టులోకి చేర్చుకుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన వారిలో కేన్ విలియమ్‌స్ (3 కోట్లు), షకీబ్ అల్ హసన్ (2 కోట్లు), కార్లొస్ బ్రాత్‌వెయిట్ (2 కోట్లు), రషీద్ ఖాన్ (9 కోట్లు), యూసుఫ్ పఠాన్ (1.9 కోట్లు), సిద్దార్థ్ కౌల్ (3.8 కోట్లు), దీపక్ హూడా (3.6 కోట్లు), రకీ భుయ్ (20 లక్షలు), నటరాజన్ (40 లక్షలు) ఉన్నారు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకున్న వారిలో మార్కస్ స్టొయినిస్ (6.2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (3 కోట్లు), ఆరోన్ ఫించ్ (6.2 కోట్లు), మాయాంక్ అగర్వార్ (ఒక కోటి), కరుణ్ నాయర్ (5.6 కోట్లు) ఉభ్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కర్న్ శర్మ (5 కోట్లు), అంబటి రాయుడు (2.2 కోట్లు), ఇమ్రాన్ తాహిర్ (ఒక కోటి), ఫఫ్ డు ప్లెసిస్ (1.6 కోట్లు), డ్వెయిన్ బ్రేవో (6.4 కోట్లు), షేన్ వాట్సన్ (4 కోట్లు)ను కూడా కొనుగోలు చేసింది.

చిత్రం..భారత మాజీ స్పిన్నర్ బేడీ ఆరోపణ