క్రీడాభూమి

ఆస్ట్రేలియా క్వీన్ వొజ్నియాకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రపంచమాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి గెల్చుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె సిమోనా హాలెప్‌ను 7-6, 3-6, 6-4 తేడాతో ఓడించింది. ఇంతకు ముందు 43 పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఆడినప్పటికీ, ఒక్కసారి కూడా టైటిల్‌ను సాధించలేకపోయిన వొజ్నియాకి తన 43వ ప్రయత్నంలో విజేతగా నిలిచింది. కెరీర్‌లో మొదటిసారి మేజర్ టైటిల్‌ను అందుకుంది. హాలెప్ చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇలావుంటే, బాలికల సింగిల్స్ టైటిల్‌ను తైవాన్‌కు చెందిన లియాంగ్ ఎన్ షువో కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె ఫ్రాన్స్ క్రీడాకారిణి ఆలరా బరెల్‌ను ఓడించింది. బాలుర సింగిల్స్ టైటిల్ అమెరికా ఆటగాడు సెబాస్టియన్ కోర్డా సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌లో అతను తైవాన్ ఆటగాడు సెంగ్ చున్ సిన్‌ను ఓడించాడు.
నేడు పురుషుల ఫైనల్
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆదివారం జరుగుతుంది. రోజర్ ఫెదరర్, మారిన్ సిలిక్ టైటిల్ కోసం పోరాడతారు.

చిత్రం..ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీతో
కరోలిన్ వొజ్నియాకి.