క్రీడాభూమి

వేలానికి వెళ్లని ఆటగాళ్లు వీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తమతమ జట్లు రీటైన్ చేసుకోవడంతో, ఈసారి ఐపీఎల్‌కు వెళ్లని ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నారు. కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నది. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని 15 కోట్ల రూపాయల ధరతో రీటైన్ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రిలీజ్ చేయని ఆటగాళ్లలో కోహ్లీతోపాటు సర్ఫ్‌రాజ్ ఖాన్ (3 కోట్లు), ఏబీ డివిలియర్స్ (11 కోట్లు) ఉన్నారు. అదే విధంగా సురేష్ రైనా (11 కోట్లు), రవీంద్ర జడేజా (7 కోట్లు)ను చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసింది. ఆండ్రె రస్సెల్ (8.5 కోట్లు), సునీల్ నారైన్ (12.5 కోట్లు)ను కోల్‌కతా నైట్ రైడర్స్, రోహిత్ శర్మ (15 కోట్లు), హార్దిక్ పాండ్య (11 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా (7 కోట్లు)ను ముంబయి ఇండియన్స్, డేవిడ్ వార్నర్ (12.5 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (8.5 కోట్లు) నిరుడు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఈసారి కూడా ప్రాతినిథ్యం వహిస్తారు. శ్రేయాస్ అయ్యర్ (7 కోట్లు), రిషభ్ పంత్ (15 కోట్లు), క్రిస్ మోరిస్ (11 కోట్లు)ను ఢిల్లీ డేర్ డెవిల్స్ విడిచిపెట్టలేదు. స్టీవెన్ స్మిత్ (12.5 కోట్లు)ను రాజస్థాన్ రాయల్స్, అక్షర్ పటేల్ (12.5 కోట్లు)ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు రీటైన్ చేశాయి.