క్రీడాభూమి

కృణాల్‌కు జాక్‌పాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఈసారి ఐపీఎల్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు కృణాల్ పాండ్య జాక్‌పాట్ కొట్టాడు. గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన అతను 243 పరుగులు చేశాడు. పది వికెట్లు సాధించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ చూపే సామర్థ్యం ఉన్న కారణంగా 8.8 కోట్ల రూపాయలు చెల్లించి ముంబయి ఇండియన్స్ తన వద్దే ఉంచుకుంది. జాతీయ జట్టుకు ఇంత వరకూ ప్రాతినిథ్యం వహించని ఆటగాళ్లలో ఎక్కువ మొత్తాన్ని పొందిన క్రికెటర్ ఇప్పటి వరకూ అతనే కావడం గమనార్హం.
ఇశాంత్‌కు షాక్
బెంగళూరు: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పేసర్ ఇశాంత్ శర్మకు 11వ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీ యాజమాన్యాలు షాకిచ్చాయి. 75 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌ను చెల్లించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దక్షిణాఫ్రికా టూర్‌లోనే ఉన్న వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్, నమన్ ఓఝా, తమిళనాడు ఓపెనర్ మురళీ విజయ్ కూడా అమ్ముడుకాలేదు.