క్రీడాభూమి

స్టోక్స్‌కు భారీ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 27: రెండు రోజుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మొదటి రోజైన శనివారం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అత్యధికంగా 12.5 కోట్ల రూపాయల ధర పలికింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడి చేశాడన్న అభియోగంపై విచారణను ఎదుర్కొంటున్న అతనికి రాజస్థాన్ రాయల్స్ అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్టోక్స్‌ను దక్కించుకోవడానికి చివరి వరకూ పోటీపడ్డారు. అయితే, 12.5 కోట్ల రూపాయలను చెల్లించడానికి వెనుకంజ వేయగా, ఆ అవకాశాన్ని రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. స్టోక్స్ కనీస ధర రెండు కోట్ల రూపాయలుకాగా, అతనికి ఎవరూ ఊహించనంత భారీ రేటు దక్కింది. కాగా, భారత ఆటగాళ్లలో లోకేష్ రాహుల్, మనీష్ పాండే చెరి పదకొండు కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. రాహుల్ కనీస ధర రెండు కోట్లుకాగా, మనీష్ పాండే కోటి రూపాయల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చాడు. ఓపెనర్ రాహుల్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పాండేను సన్‌రైజర్స్ హైదరాబాద్ పదకొండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాయి. నిరుటి ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున రాహుల్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పాండే ఆడారు. అయితే, ఈ రెండు ఫ్రాంచైజీలు వారిని తిరిగి తామే తీసుకోవడానికి వీలు కల్పించే ‘రైట్ టు మ్యాచ్’ (ఆర్‌టీఎం)ను వినియోగించుకోకపోవడం గమనార్హం.
రెండు కోట్ల బేస్ ప్రైస్ ఉన్న కేదార్ జాధవ్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 7.60 కోట్ల రూపాయలను చెల్లించి కొనుక్కుంది. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన కరుణ్ నాయర్ కోసం అదే ఫ్రాంచైజీ 5.60 కోట్ల రూపాయలు వెచ్చించింది.
భారత అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీ షాను ఢిల్లీ డేర్ డెవిల్స్ 1.2 కోట్లు, అదే జట్టులోని శుభం గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 1.8 కోట్లు, కుల్వంత్ ఖెజ్రోలియాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 85 లక్షల రూపాయలు వెచ్చించి కొన్నాయి. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ సాధిస్తున్న వరుస విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఫాస్ట్ బౌలర్ కమలేష్ నగర్‌కోటిని కోల్‌కతా నైట్ రైడర్స్ 3.2 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకోవడం విశేషం.

చిత్రం..బెన్ స్టోక్స్