క్రీడాభూమి

ఇంకెంతకాలమో నాకే తెలీదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 29: ఇంకా ఎంతకాలం టెన్నిస్ ఆడతానో, కెరీర్‌ను కొనసాగిస్తానో తనకే తెలియదని ఆస్ట్రేలియా ఓపెన్ విజేత రోజర్ ఫెదరర్ వ్యాఖ్యానించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో 36 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ వీరుడు 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో మారిన్ సిలిక్‌ను ఓడించిన విషయం తెలిసిందే. సంప్రదాయం ప్రకారం సోమవారం అతను గవర్నమెంట్ హౌస్ వద్ద ఫొటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గత 12 నెలల కాలంలో మూడు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను గెల్చుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, నిజానికి ఈ విషయాన్ని తానే నమ్మలేకపోతున్నానని చెప్పిడు. ఇంకా ఎన్ని పర్యాయాలు మేజర్ టోర్నీల్లో టైటిల్ మ్యాచ్‌లు ఆడతారన్న ప్రశ్నపై స్పందిస్తూ, నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయం తనకే తెలియదని స్పష్టం చేశాడు. ఫామ్ ఉన్నంత కాలం కెరీర్‌ను కొనసాగిస్తానని అన్నాడు. కెరీర్‌లో 20 గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్న ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అత్యధికంగా ఆరోసారి విజేతగా నిలిచి, నొవాక్ జొకోవిచ్, రాయ్ ఎమర్సన్‌తో రికార్డును పంచుకుంటున్నాడు.