క్రీడాభూమి

అఫ్గాన్‌ను ఓడించి ఫైనల్ చేరిన ఆసీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, జనవరి 29: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. జాక్ ఎడ్వర్డ్స్ బ్యాటింగ్ ప్రతిభకు, బౌలింగ్ విభాగం మద్దతుగా నిలవడంతో అఫ్గానిస్థాన్‌ను ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. ఈ టోర్నీలో ఎవరూ ఊహించని రీతిలో దూసుకెళుతున్న అఫ్గాన్‌కు ఆసీస్ సమర్థంగా బ్రేక్ వేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 48 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ఇక్రామ్ అలీ ఖిల్ 80 పరుగులు చేసి, జట్టును ఆదుకున్నాడు. అతని తర్వాత అత్యధిక స్కోరు ఓపెనర్ రహమానుల్లా (20 పరుగులు)ది కావడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో జొనథాన్ మెర్లో 24 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను చిన్నాభిన్నం చేశాడు. జాక్ ఇవాన్స్ 26 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. ర్యాన్ హాడ్లే, జాక్ ఎడ్వర్డ్స్, విల్ సదర్లాండ్, లాయిడ్ పోప్ తలా ఒక్కో వికెట్ సాధించారు.
ఫైనల్ చేరడానికి 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 26 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను మాక్స్ బ్రియాంట్ (4) వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ జాసన్ సంఘాతో కలిసి ఓపెనర్ జాక్ ఎడ్వర్డ్స్ స్కోరు బోర్డును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. 38 బంతులు ఎదుర్కొని, 26 పరుగులు చేసిన సంఘాను క్వాయిస్ అహ్మద్ రిటర్న్ క్యాచ్ పట్టి ఔట్ చేయగా, జొనథాన్ మెర్లో 17 పరుగులు సధించి, నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఇక్రామ్ అలీ ఖిల్‌కు దొరికిపోయాడు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడి, 65 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులు చేసిన ఎడ్వర్డ్స్‌ను క్వాయిస్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం పరమ్ ఉప్పల్ (32 నాటౌట్),, నాథన్ మెక్‌స్వీనీ (22 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డా. ఆస్ట్రేలియా 37.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 182 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్ చేరింది. జాక్ ఎడ్వర్డ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మంగళవారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేత జట్టుతో ఆస్ట్రేలియా ఫైనల్‌లో ఢీ కొంటుంది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్:48 ఓవర్లలో 181 ఆలౌట్ (రహమానుల్లా 20, ఇక్రం అలీ ఖిల్ 80, జొనథాన్ మెర్లో 4/24, జాక్ ఇవాన్స్ 2/26).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 37.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 (జాక్ ఎడ్వర్డ్స్ 72, జాసన్ సంఘా 26, పరమ్ ఉప్పల్ 32 నాటౌట్, నాథన్ మెక్‌స్వీనీ 22 నాటౌట్, క్వాయిస్ అహ్మద్ 2/35).

చిత్రం..ఇక్రామ్ అలీ ఖిల్
(80 పరుగులు)