క్రీడాభూమి

చెన్నై సూపర్ కింగ్స్‌లో అంతా సీనియర్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: త్వరలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు వివిధ ఫ్రాంచైజీలు దక్కించుకున్న క్రికెటర్లలో అత్యధిక శాతం మందిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఈ సీఎస్‌కే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించనుండగా, డిప్యూటీ కెప్టెన్‌గా సురేష్ రైనా వ్యవహరిస్తాడు. 2010, 2011లలో ధోని సారధ్యంలోని జట్టు టైటిల్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ జట్టుకు స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. క్రీడాకారుల ఎంపిక కోసం రెండు రోజుల పాటు జరిగిన వేలంలో ఎక్కువ మంది సీనియర్లు చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ అత్యధికంగా అమ్ముడుపోయిన క్రికెటర్‌గా గుర్తింపు పొందినా అదేమంత ఆశ్చర్యం కలిగించలేదు. అదేవిధంగా భారత పేసర్ జయదేవ్ ఉనాద్కత్ సైతం అత్యధికంగా అమ్ముడుపోయిన క్రికెటర్‌గా ఘనత సాధించడంతో ఎక్కువమంది క్రీడాభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఐపీఎల్‌లో పాల్గొనే ఎనిమిది జట్లకు క్రీడాకారుల ఎంపిక పూర్తయిన తర్వాత ఏఏ జట్టు బలమైనవో, ఏఏ జట్లు బలహీనమైనవోనన్న చర్చోపచర్చలు అంతటా జరిగాయి.
దాదాపు అన్ని జట్లలోనూ పరిణిచి చెందిన క్రీడాకారులు ఉన్నా అత్యధిక శాతం మంది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుందని క్రీడాభిమానులు అంటున్నారు. ఈ టీమ్‌లో రవీంద్ర జడేజా, ఫఫ్ డుప్లెసిస్, డ్వేన్ బ్రేవో, మురళీ విజయ్, హర్బజన్ సింగ్, షేన్ వాట్సన్, శద్రుల్ ఠాకూర్, ఇమ్రాన్ తహిర్, అంబటి రాయుడు వంటి పేరొందిన ఆటగాళ్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.