క్రీడాభూమి

న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వీన్‌స్టన్, జనవరి 30: క్వీన్‌స్టన్ ఈవెంట్ సెంటర్‌లో మంగళవారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 261 పరుగులు చేయగా, లక్ష్యసాధనకు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 32 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్ గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో టామ్ బాంటన్ అత్యధిక పరుగులు చేశాడు. ఇతను 122 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 112 పరుగులు చేశాడు. జట్టులో సవిన్ పెరెరా 38 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 19 పరుగులు చేశాడు. లియామ్ బాంక్స్ 21 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి లూక్ జార్జ్‌సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విల్ జాక్స్ 7 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఏడు పరుగులు చేసి, బోషియర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వికెట్ కీపర్ జాక్ డేవిస్ 76 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 63 పరుగులు చేసి లూక్ జార్జసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఇవాన్ ఉడ్స్ 12 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో సెంట్ మాక్స్ చూకు క్యాచ్ ఇచ్చాడు. ఫినే్ల ట్రెనౌత్ 8 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 6 పరుగులు చేశాడు. టామ్ 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 22 పరుగులు, ప్రేమ్ సిసోడియా 5 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఏడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్ జట్టులో లూక్ జార్జ్‌సన్ 10 ఓవర్లలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. రచిన్ రవీంద్ర 10 ఓవర్లలో 80 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. టాడ్ వాట్సన్, కేలమ్ బోసియర్ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 10 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఈ జట్టులో ఫిన్ అలెన్ సెంచరీ సాధించాడు. జాకోబ్ భులా 9 బంతులు ఎదుర్కొని నాలుగ ఫోర్లు చేసి పెన్నింగ్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర 24 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి దిలాన్ పెన్నింగ్టన్ బౌలింగ్‌లో జాక్ డేవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్ కేలమ్ బోసియర్ 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 31 పరుగులు చేసి ఇయాన్ జాక్స్ బౌలింగ్‌లో ఆడమ్ ఫింఛకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కాటన్ క్లార్ల్ 69 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇయాన్ ఉడ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. సందీప్ పటేల్ 15 బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు చేసి ఇయాన్ ఉడ్స్ బౌలింగ్‌లో తిలాన్ పెన్నింగ్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. టాడ్ వాట్సన్ రనౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ మాక్స్ చూ 4 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో టామ్ క్రివెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫెలిక్స్ ముర్రే 2 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఇయాన్ ఉడ్స్ 9 ఓవర్లలో 44 పరుగులిచ్చి 3 వికెట్లు, విల్ జాక్స్ 9.1 ఓవర్లలో 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. దిలాన్ పెన్నింగ్టన్ 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
ఇంగ్లాండ్ వికెట్ల పతనం: 21-1 (లియాన్ బంక్స్, 7.1), 40.2 (సవిన్ పెరెరా, 12.1), 48.3 (విల్ జాక్స్, 13.1), 187.4 (జాక్ డేవిస్, 39.1), 198-5 (ఇయాన్ ఉడ్స్, 42.2), 216-6 (్ఫనే్ల ట్రెనౌత్, 45-1), 235-7 (టామ్ బాంటన్, 47.3)
న్యూజిలాండ్ వికెట్ల పతనం: 20-1 (జాకోబ్ భులా, 5.2), 21-2 (రచిన్ రవీంద్ర, 5.4), 88-3 (కేలమ్ బోషియర్, 20.1), 201-4 (్ఫన్ అలెన్, 41.2), 210-5 (కేటెన్ క్లార్క్, 43.4), 213-6 (సందీప్ పటేల్, 44.6) 214-7 (టాడ్ వాట్సన్, 45.1), 226-8 (లూక్ జార్జ్‌సన్, 46.4), 229-9 (ఫెలిక్స్ ముర్రే, 47), 229-10 (మాక్స్ చూ, 47.1)