క్రీడాభూమి

శుభ్‌మాన్.. పంజాబ్‌కు మరో ‘యువరాజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: పాక్‌తో మంగళవారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో తన అద్భుత ఆటతీరుతో, అత్యధిక స్కోరుతో జట్టును విజయపథాన నిలిపిన యువ సంచలనం శుభ్‌మాన్ గిల్‌పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మన్ అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ ఇప్పటివరకు 341 పరుగులు చేశాడు. ఈ యువ క్రికెటర్ ఇపుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. సెమీస్‌లో గిల్ చూపిన ప్రతిభతో అతను పంజాబ్ క్రికెట్‌కు అందివచ్చిన మరో ‘యువరాజ్’ అని పలువురు కొనిడాడుతున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం పాటలో 1.8 కోట్ల రూపాయలు గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకుంది. ఇప్పటివరకు జరిగిన వివిధ టోర్నీలలో శుభ్‌మాన్ చూపిన అసమాన ప్రతిభను కొందరు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. శుభ్‌మాన్ గిల్ చక్కని ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదని, అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ చక్కగా రాణిస్తూ అన్నింటా మెరుగులు దిద్దుకుంటున్నందున, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎక్కువ స్కోరు చేయగల సత్తా ఉన్నవాడని క్రీడాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.