క్రీడాభూమి

అంకితభావంతో అరుదైన ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 30: అండర్-19 భారత క్రికెట్ జట్టుకు శుభ్‌మాన్ గిల్ ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని తండ్రి లఖ్విందర్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం వల్లనే తన కుమారుడు ఇంతటి ఘనతను సాధించాడని ఆయన మంగళవారం విలేఖరులతో చెప్పారు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న అండర్- 19 ప్రపంచ కప్ పోటీలో తన కుమారుడు అద్భుత నైపుణ్యం ప్రదర్శించడం దేశానికే గర్వకారణం అన్నారు. పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గిల్ సెంచరీ సాధించి, ఆ దేశాన్ని ఓడించడంతో భారత్ శక్తిసామర్థ్యాలు మరోసారి రుజువైనట్లు తెలిపారు. తన కుమారుడు చిన్నప్పటి నుంచీ ఏ ఆటల జోలికీ వెళ్లేవాడు కాడని, ఎప్పుడూ క్రికెట్ బ్యాట్ పట్టుకుని గడిపేవాడని ఆయన గుర్తుచేశారు. పదిహేనేళ్ల పాటు తన కుమారుడికి క్రికెట్‌లో శిక్షణ ఇప్పించామన్నారు. పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌లో 18 ఏళ్ల గిల్ 102 పరుగులు చేసి భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కృషి చేశాడు. ఫైనల్స్‌లోనూ సత్తాచాటి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకుంటుందని గిల్ తండ్రి అన్నారు.