క్రీడాభూమి

కుర్రాళ్లు.. కుమ్మేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చ్, జనవరి 30: ఐసీసీ అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ సెమీఫైనల్స్‌లో భారత యువ జట్టు దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్‌ను మట్టికరిపించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆడిన వివిధ టోర్నీలలో భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా దూకుడు ప్రదర్శించి ఆరోసారి ఫైనల్‌కు చేరింది. మంగళవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్స్‌లో ప్రత్యర్థి టీమ్‌ను 69 పరుగులకే కుప్పకూల్చింది. 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసిన భారత్‌కు ఏదశలోనూ పాక్ గట్టి పోటీ ఇవ్వలేక చతికిలపడింది. పాక్‌పై 203 పరుగుల భారీ ఆధిక్యంతో దూసుకెళ్లి ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, భారత్ జట్లు ప్రపంచ కప్‌ను మూడేసిసార్లు దక్కించుకున్నాయి. ఫైనల్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు ఉత్కంఠభరితంగా ఉంటుంది.
పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ పృథీ షా, మనోజ్ కల్రాతో కలసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించాడు. ఇద్దరూ మంచి జోరుమీదున్న తరుణంలో కెప్టెన్ షా 42 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రనౌట్ అయ్యాడు. ఓపెనర్ మన్‌జోత్ కల్రా అర్ధ సెంచరీకి చేరువలో 59 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేసి మహ్మద్ ముషా బౌలింగ్‌లో రోహైల్ నజీర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. దీంతో 84 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శుభమన్ గిల్ మొదటినుండి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. సెమీస్ మొత్తంలో గిల్ హైలెట్‌గా నిలిచాడు. ఇతను 94 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్‌కు అండగా నిలిచిన హార్విక్ దేశాయ్ జట్టు 148 పరుగుల స్కోరు వద్ద ఔటయ్యాడు. రియన్ పరాగ్ ఐదు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి అర్షద్ ఇక్బాల్ బౌలింగ్‌లో రోహైల్ నజీర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంకుల్ సుధాకర్ రాయ్ 45 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సహాయంతో 33 పరుగులు చేసి, మహ్మద్ ముసా బౌలింగ్‌లో రోహైల్ నజీర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ద దారిపట్టాడు. కమలేష్ నాగర్‌కోటి ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి షహీద్ ఆఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. శివం మావి ఆరు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి మహ్మద్ ముసా బౌలింగ్‌లో ఇమ్రాన్ షాకు క్యాచ్ ఇచ్చాడు. శివ సింఘ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి మహ్మద్ ముసా చేతిలో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. ఇషాన్ పొరెల్ ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ జట్టులో మహ్మద్ ముసా 10 ఓవర్లలో 67 పరుగులిచ్చి నాలుగు వికెట్టు తీసుకున్నాడు. అర్షద్ ఇక్బాల్ 10 ఓవర్లలో 51 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. షహీన్ ఆఫ్రిది 10 ఓవర్లలో 62 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు.
273 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు ఆదినుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. భారత బౌలర్ ఇషాన్ పొరెల్ ధాటికి బ్యాట్స్‌మెన్లు గిజగిజలాడారు. పొరెల్ ఆరు ఓవర్లలో 12 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. బౌలర్లను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌లు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి టపటపా మొత్తం వికెట్లన్నీ కోల్పోయి 29.3 ఓవర్లకు కేవలం 69 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. పాక్ జట్టులో ఇమ్రాన్ షా 14 బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి ఇషాన్ పొరెల్ బౌలింగ్‌లో పృథీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. మహ్మద్ జైద్ ఆలమ్ 10 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేసి ఇషాన్ పొరెల్ బౌలింగ్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చాడు. జట్టు ఎనిమిదో ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి 20 పరుగులు
మాత్రమే చేసిన దశలో పాక్ టాప్ ఆర్డర్‌లో ముగ్గురిని పొరెల్ తన అద్భుత బౌలింగ్‌తో పెవిలియన్ దారిపట్టించాడు. వికెట్ కీపర్ రోహైల్ నాజిర్ బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో శుభం గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అలీ జర్యాబ్ 9 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగులు చేసి ఇషాన్ పొరెల్ బౌలింగ్‌లో పృథీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు.
అమ్మద్ ఆలం 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో నాలుగు పరుగులు చేసి ఇషాన్ పొరెల్ బౌలింగ్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మహ్మద్ తాహా 23 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి శివ సింగ్ బౌలింగ్‌లో కె.నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చాడు. షాద్ ఖాన్ 33 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 13 పరుగులు చేసి అంకుల్ రాయ్ బౌలింగ్‌లో హార్విక్ దేశాయ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్ హసన్ ఖాన్ 5 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. షహీన్ ఆఫ్రిది 11 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే శివ సింగ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మహ్మద్ ముసా 14 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అర్షద్ ఇక్బాల్ 4 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఇషాన్ పొరెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. పాక్‌లో కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారంటే భారత్ బౌలింగ్ సామర్థ్యం ఏపాటిదో ఇట్టే అర్ధమవుతుంది. భారత బౌలర్లలో ఇషాన్ పొరెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు చేజిక్కించుకోగా, శివ సింగ్ 8 ఓవర్లలో 20 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. రియాన్ పరాగ్ 4 ఓవర్లలో ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అంకుల్ సుధాకర్ రాయ్ రెండు ఓవర్లలో 11 పరుగులిచ్చి ఒక వికెట్, అభిషేక్ శర్మ 0.3 ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా ఒక వికెట్ తీసుకున్నారు.