క్రీడాభూమి

ఫైనల్‌లో సత్తా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్ట్‌చర్చ్, జనవరి 30: అండర్-19 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ విజయఢంకా మోగించి ఫైనల్‌కు చేరువకావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాతో హోరాహోరీగా తలపడితే ఏడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకోవచ్చని పలువురు ఆశిస్తున్నారు. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత్ 203 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది. పాక్‌పై ఆడిన ఐదు మ్యాచ్‌ల సెమీఫైనల్స్‌లలో భాగంగా 2000లో మహ్మద్ కైఫ్ నాయకత్వంలో, 2008లో విరాట్ కోహ్లీ, 2012లో ఉన్మక్ చంద్ నాయకత్వంలో భారత్ విజయం సాధించింది. అయితే, 2006లో చటేశ్వర్ పుజారా నాయకత్వంలో, 2106లో ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఓటమి చెందింది. ఇపుడు మళ్లీ పృథ్వీ షా నాయకత్వంలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు సాధించింది. ఈ జట్టులో శుభ్‌మాన్ గిల్ తన అద్భుత ఆటతీరుతో 102 నాటౌట్‌గా నిలిచి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఇషాన్ పొరెల్ ఆరు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి ప్రత్యర్థి జట్టులోని టాప్ ఆర్డర్‌ను పడగొట్టాడు. తమ ముందున్న భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ ఘోరంగా విఫలమై 29.3 ఓవర్లలో 69 పరుగులకే వికెట్లన్నీ సమర్పించుకుంది. దీనిని బట్టి చూస్తే భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఔట్ చేయడం గొప్పవిషయం. పాక్‌పై విజయంతో శనివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని కెప్టెన్ పృథీ షా అన్నాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని టోర్నీలలో తమ జట్టు ఒక్క మ్యాచ్‌ను కూడా కోల్పోకుండా ఆడినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఫైనల్‌లోనూ అదే ఉత్సాహం, పట్టుదలతో ఆడి ఆస్ట్రేలియాను సైతం ఒడించగలమనే ధీమాను వ్యక్తం చేశాడు. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయాన్ని పృథ్వీ షా గుర్తు చేస్తూ అలాంటి శుభఘడియ కోసం తామంతా ఎదురుచూస్తున్నామని అన్నాడు.