క్రీడాభూమి

మోమినుల్ అజేయ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, జనవరి 31: మోమునుల్ హక్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో, శ్రీలంకతో బుధవారం ఇక్కడ మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 374 పరుగుల భారీ స్కో చేయగలిగింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (52), ముష్ఫికర్ రహీం (92) అర్ధ శతకాలతో రాణించి, ఈ భారీ స్కోరుకు సహకరించారు. మొదటి వికెట్‌కు 72 పరుగులు జోడించిన తమీమ్ ఇక్బాల్, ఇమానుల్ కయాస్ బంగ్లా ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశా. 40 పరుగులు సాధించిన కయాస్‌ను లక్షన్ సండాకన్ ఎల్‌బిగా ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. కాస్ 53 బంతుల్లోనే 52 పరుగులు సాధించి, దల్‌రువాన్ పెరెరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 120 పరుగుల వద్ద రెండో వికెట్ కూలగా, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీం శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి, స్కోరుబోర్డును ముందుకు దూకించారు. మూడో వికెట్‌కు 230 పరుగులు జత చేసిన తర్వాత, సురంగ లక్మల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ పట్టగా మోమినుల్ హక్ ఔటయ్యాడు. 192 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లతో 92 పరుగులు సాధించిన అతను దురదృష్టవశాత్తు ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తర్వాతి బంతికే వికెట్‌కీపర్ లింటన్ దాస్ (0)ను లక్మల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహమ్మదుల్లా (9)తో కలిసి, మరో వికెట్ కూలకుండా మొదటి రోజు ఆటను ముగించిన మోమినుల్ హక్ 203 బంతులు ఎదుర్కొని, 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 175 పరుగులు సాధించాడు. గురువారం నాటి ఆటలో అతను డబుల్ సెంచరీ సాధించే అవకాశాలున్నాయి.