క్రీడాభూమి

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాకు ఐదో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వీన్స్‌లాండ్ (న్యూజిలాండ్), జనవరి 31: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఐదో స్థానం దక్కించుకుంది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 41.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అఫిఫ్ హొస్సేన్ (63), వికెట్‌కీపర్ షకీల్ హొస్సేన్ (61) అర్ధ శతకాలు సాధించినప్పటికీ, మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ప్రత్యర్థి ముందు బంగ్లాదేశ్ భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లను, ప్రత్యేకించి ఫ్రేజర్ జోన్స్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన బంగ్లా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. జోన్స్ 52 పరుగులకు ఐదు వికెట్లు సాధించాడు. అఖోనా మకా 27 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కాగా, గెలవడానికి అవసరమైన 179 పరుగులను దక్షిణాఫ్రికా కేవలం రెండు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. మాథ్యూ బ్రెడ్‌లిజ్ 36, జీవేష్ పిళ్లై 12 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే, రేనార్డ్ వాన్ టోన్డర్ (99 బంతుల్లో 82 పరుగులు), హెర్మన్ రోల్ఫెస్ (51 బంతుల్లో 44) చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో రాణించి, మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, దక్షిణాఫ్రికాకు సునాయాస విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ అండర్-19 ఇన్నింగ్స్: 41.4 ఓవర్లలో 178 అలౌట్ (ఆఫిఫ్ హొస్సేన్ 63, షకీల్ హొస్సేన్ 61, టిపూ సుల్తాన్ 18 నాటౌట్, ఫ్రేజర్ జోన్స్ 5/52, అఖోనా మకా 3/27).
దక్షిణాఫ్రికా అండర్-19 ఇన్నింగ్స్: 38.3 ఓవర్లలో 2 వికెట్లకు 180 (రేనార్డ్ వాన్ టోన్డర్ 82 నాటౌట్, హెర్మన్ రోల్ఫెస్ 44 నాటౌట్, రోనీ హొస్సేన్ 1/27, ఖాజీ ఒనిక్ 1/31).