క్రీడాభూమి

నాకు విశ్రాంతి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: అవిశ్రాంతంగా టోర్నీలు, సిరీస్‌లు ఆడడం కష్టంగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులకు సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ లేఖ రాసింది. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలో జరిగే ఆసియా టీం చాంపియన్‌షిప్ పోటీల నుంచి తనను తప్పించాల్సిందిగా ఆమె తన లేఖలో కోరింది. జకార్తాలో ఇండోనేషియా ఓపెన్‌లో పాల్గొన్న ఆమె తగినంత విశ్రాంతి లేకుండానే స్వదేశంలో ఇండియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో ఆడుతున్నది. ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ఆసియా టీం చాంపియన్‌షిప్స్‌లో ఆడడం కష్టమని బాయ్‌కి రాసిన లేఖలో సైనా స్పష్టం చేసింది. మార్చి 14 నుంచి 18 వరకూ లండన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్‌లో ఆడడానికి ముందు విశ్రాంతిని కోరుకుంటున్నట్టు ఆమె వివరించింది.
సోఫీపై గెలుపు
ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్‌లో భాగంగా బుధవారం సోఫీ హోమ్‌బొయే దల్‌తో జరిగిన మ్యాచ్‌ని సైనా 21-15, 21-9 తేడాతో గెల్చుకుంది. సైనా విజృంభణకు సోఫీ ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. మరో మ్యాచ్‌లో పీవీ సింధు 21-10, 21-13 ఆధిక్యంతో నతాలియా కొచ్ రాటేను, రుత్విక శివానీ గద్దె 21-17, 21-10 తేడాతో అమిలీ హాజ్‌ను ఓడించారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-17, 21-18 స్కోరుతో లీ చెంక్ ఇన్‌పై విజయం సాధించాడు. పారుపల్లి కశ్యప్ 21-14, 21-18 ఆధిక్యంతో హన్స్ క్రిస్టియన్ సోల్ట్‌బెర్గ్ విటింగస్‌ను ఓడించాడు. కాగా, సమీర్ వర్మ, అజయ్ జయరామ్ తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను చవిచూశారు.
మళ్లీ ఫాంలోకి వస్తా: శ్రీకాంత్
తాను మళ్లీ ఫాంలోకి వస్తానని భారత బాడ్మింటన్ స్టార్, ప్రపంచ మూడో నెంబర్ ఆటగాడస కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. చిన్న గాయం కారణంగా ఈ సీజన్‌లో ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో డ్రాగా ముగిసిన నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే తాను మళ్లీ పుంజుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ సందర్భంగా కడుపులో కండరాల నొప్పితో బాధపడిన శ్రీకాంత్ ఇండోనేషియా మాస్టర్ టోర్నీలో సైతం ఆడలేకపోయాడు. అనారోగ్య సమస్య కారణంగా ఈ సీజన్ ప్రారంభంలో సరిగా ఆడలేకపోయినా రానున్న టోర్నీలపై మరింత దృష్టి సారిస్తానని, మునుపటిలా దూసుకుపోతానని ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడాది ముగిసిన సీజన్‌లో శ్రీకాంత్ ఆడిన ఐదు ఫైనల్ మ్యాచ్‌లలో నాలుగింటిలో గెలుపొంది టైటిల్స్ సాధించాడు. శ్రీకాంత్ చక్కటి ఆటతో రాణిస్తూ, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం వరకూ వెళ్లగలిగాడు. కొత్త ఏడాది నంబర్ వన్‌గా నిలవడమే అంటున్న ఈ యువ ఆటగాడికి అనుకున్నది సాధించడం అసాధ్యమేమీ కాదు. ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్, డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్, ఫ్రెంచ్ సూపర్ సిరీస్ టోర్నీలను గెల్చుకొని, ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ ఇకపై కూడాఅదే స్థాయిలో ఆడతాడని అభిమానుల విశ్వాసం.