క్రీడాభూమి

ద్రవిడ్‌లాంటి కోచ్ కావాలి: రమీజ్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 31: భారత్ క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వంటి కోచ్ తమ దేశానికి కూడా అవసరమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. భారత యువ క్రికెటర్లు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చేసిన కృషిలో ద్రవిడ్ పాత్ర ఎంతో ఉందని అన్నాడు. మంగళవారం జరిగిన అండర్-19 సెమీఫైనల్స్‌లో భారత్ 203 పరుగులతో పాక్‌కు మట్టికరిపించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో తమ జట్టు నిర్ణీత స్కోరును సాధించలేక అతితక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టడం షాక్‌కు గురిచేసిందని అన్నాడు. తమ దేశ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని అన్నాడు. భారత ఆటగాళ్లు ఒత్తిడిని సైతం ఎదుర్కొని విజయతీరాలకు చేరుకున్నారని, ఇందులో శుభ్‌మాన్ గిల్ వంటి వారి ఆట తీరు తననెంతో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. భారత యువ బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరుతో అలరించడం వెనుక ఆ జట్టు కోచ్ పాత్ర ఎంతో ఉందని, ఆ గౌరవం అతనికే దక్కుతుందని రమీజ్ పేర్కొన్నాడు. కోచ్, మెంటర్‌గా బాధ్యతలు నిర్వహించిన రాహుల్ ద్రవిడ్ వల్లే భారత్ యువసేన పెద్ద విజయం దక్కించుకుందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ మాత్రమే కాకుండా ఎన్నో విషయాలను ద్రవిడ్ నుంచి భారత యువ క్రికెటర్లు నేర్చుకుంటున్నారని అన్నాడు. పాక్ క్రికెట్ విధానాన్ని ప్రక్షాళన చేయాలని, యువ జట్టుపై క్రికెట్ బోర్డు మరింత దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించాడు. ఇకనైనా యువ క్రికెటర్లు మరింత బాధ్యతాయువతంగా ఆడాలని, ఇందుకు తమ దేశం తగిన చర్యలు తీసుకోవాలని రమీజ్ రాజా సూచించాడు. భారత్ మాదిరిగానే తమ దేశ క్రికెట్ జట్టు తీరు మెరుగుపడేందుకు రాహుల్ ద్రవిడ్ లాంటి వ్యక్తులు బాధ్యతలు తీసుకోవాలని అన్నాడు.