క్రీడాభూమి

క్లార్క్‌కు రుణపడి ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: త్వరలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో 20 లక్షల రూపాయలకు ఢిల్లీ డేర్ డెవిల్ జట్టు కొనుగోలు చేసిన 17 ఏళ్ల నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచ్‌హనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్ల్ దృష్టిని ఆకర్షించాడు. లెగ్‌స్పిన్నర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సందీప్ బౌలింగ్ ప్రతిభ తనను ఎంతో ఆకట్టుకుంటోందని క్లార్క్ ప్రశంసిస్తున్నాడు. కాగా, తనకు అండగా నిలిచిన క్లార్క్‌కు రుణపడి ఉంటానని సందీప్ చెప్పాడు. మేటి ఆటగాడైన స్మిత్ దీవెనలు తన ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని ఈ యువ సంచలనం పేర్కొన్నాడు. వాస్తవానికి ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడే తమ దేశ క్రికెటర్లను ఆటతీరును ఎప్పుడూ పొగడని క్లార్క్ ఒక యువ క్రికెటర్ ఆటతీరును అన్నివిధాల ప్రశంసిస్తున్నాడు. తన ఎదుగులకు మైకేల్ క్లార్క్ ప్రభావం చాలా ఉందని సందీప్ అన్నాడు. హాంకాంగ్ సిక్సెస్ మ్యాచ్ సందర్భంగా తన బౌలింగ్ తీరును స్వయంగా చూసిన క్లార్క్ గొప్ప మనిషని, ఒక క్రికెటర్‌గా తన ఎదుగుదలకు పరోక్షంగా సహకరిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. తన బౌలింగ్‌ను చూసినప్పుడల్లా అతని ఆటతీరు తననెంతో ఆకట్టుకుంటోందని క్లార్క్ చెబుతుండగా అదంతా అతని పుణ్యమేనని సందీప్ అంటున్నాడు. ఇదిలావుండగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో క్రికెటర్ల వేలం సందర్భంగా మైకేల్ క్లార్క్‌తో సంప్రదింపులు జరిపిన సందర్భంగా ఇచ్చిన సూచనలు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడ్డాయని సందీప్ అన్నాడు. సిడ్నీలోని వెస్టర్న్ సుబర్బ్స్ క్రికెట్ క్లబ్‌లో కొన్నాళ్ల కిందట తాను ఆడిన లీగ్ మ్యాచ్ తన జీవితంలో మరువలేనినది అన్నాడు. ఆ మ్యాచ్‌లో గెలుపు సాధించడం తనలాంటి యువ క్రికెటర్లకు మంచి మలుపని అభివర్ణించాడు. గుగ్లీ వేయడంలో దిట్టగా పేరుగాంచిన సందీప్ తమ జాతీయ కోచ్ రాజు ఖడ్కా ఆధ్వర్యంలో ఈ దిశగా మరింత పరిణితి చెందానని అన్నాడు.
ఇదిలావుండగా ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఎంపికైన సందీప్ తనను ట్రయల్స్‌కు ఆహ్వానించిపుడు కోచ్‌లను సైతం తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏ సందర్భంలోనైనా ఆత్మవిశ్వాసం లేనపుడు ముందుకు సాగడం కష్టమన్న నానుడిని తాను ఆచరిస్తానని గట్టి నమ్మకంతో చెబుతున్నాడు సందీప్. తమ దేశంలో అన్ని సౌకర్యాలు కలిగిన స్టేడియం ఒకే ఒకటని ఉందని, అయినా తమలాంటి యువకులు పట్టుదలతో ఎంతో నేర్చుకుంటున్నామని అన్నాడు. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన తమ దేశానికి ఎంతో రుణపడి ఉంటానని అన్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఎంపికైన తాను జాతీయ జట్టులో చోటు కోసం దక్కించుకోవడం తన ధ్యేయమని పేర్కొన్నాడు. ప్రముఖ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, షేన్ వార్న్ తనకు స్ఫూర్తిదాతలని, వారు గొప్ప క్రికెటర్లని అన్నాడు. ఈ ఇద్దరు మేటి ఆటగాళ్ల ఆటతీరును తాను వీక్షించేవాడినని అన్నాడు.