క్రీడాభూమి

రాయుడిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సస్పెన్షన్ వేటు వేసింది. అతనిని రెండు మ్యాచ్‌ల నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కర్నాటకతో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న సంఘటనపై ఫీల్డ్ అంపైర్లు అభిజిత్ దేశ్‌ముఖ్, ఉల్హాస్ విఠల్‌రావు గాంధే, థర్డ్ అంపైర్ అనీల్ దండేకర్ చేసిన ఫిర్యాదుపై బీసీసీఐ స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మ్యాచ్‌లో కర్నాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ డీప్ మిడ్ వికెట్ దిశగా కొట్టిన బంతి ఫోర్‌గా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మెహదీ హసన్ కాలి బౌండరీ లైన్ రోప్‌కు తగిలింది. అయితే, ఫీల్డ్ అంపైర్లు ఈ విషయాన్ని గమనించలేదు. దానిని ఫోర్‌గా పరిగణించలేదు. నాయర్ రెండు పరుగులు చేయడంతో, వాటిని మాత్రమే స్కోరులోకి చేర్చారు. కర్నాటక ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 203 పరుగులు చేసింది. అయితే, హసన్ కాలు బౌండరీ లైన్‌కు తగిలిన విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి కర్నాటక కెప్టెన్ వినయ్ కుమార్ తీసుకెళ్లాడు. వీడియో రీప్లేను పరిశీలించిన తర్వాత, అతని వాదనతో ఏకీభవించిన అనీల్ దండేకర్ కర్నాటక ఖాతాలో మరో రెండు పరుగులను చేర్చి, హైదరాబాద్ లక్ష్యాన్ని 205 పరుగులుగా నిర్ధారించాడు. ఫలితంగా ఆ జట్టు రెండు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. చివరి క్షణాల్లో లక్ష్యాన్ని మార్చడంపై అంబటి రాయుడు నిరసన వ్యక్తం చేశాడు. ఫీల్డ్ అంపైర్లపై ఆగ్రహించాడు. నిబంధనల ప్రకారం ఈ విధంగా ప్రవర్తించడం నేరం. మ్యాచ్ అంపైర్ల ఫిర్యాదు మేరకు ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న బీసీసీఐ అంబటి రాయుడును రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేసింది. ఈ కారణంగా అతను ఈనెల 5 నుంచి మొదలయ్యే విజయ్ హజారే టోర్నీలో సర్వీసెస్, జార్ఖండ్ జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో అవకాశాన్ని కోల్పోయాడు.