క్రీడాభూమి

కొత్త ఫార్మాట్‌లో.. కొత్త ఉత్సాహంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్బన్, జనవరి 31: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడగలమన్న నమ్మకం... జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్టులో విజయం సాధించడంతో వచ్చిన రెట్టించిన ఆత్మవిశ్వాసం భారత క్రికెట్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 1-2 తేడాతో చేజార్చుకున్నప్పటిగకీ, ఆరు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా పట్టుదలతో ఉంది. అంతేగాక, రాబోయే టూర్లు, సిరీస్‌లను కూడా దృష్టిలో ఉంచుకొని, ఈ సిరీస్‌ను సన్నాహక ఈవెంట్‌గా తీసుకుంది. గురువారం ఇక్కడ జరిగే మొదటి వనే్డతోనే విజయ పరంపరలకు శ్రీకారం చుట్టాలని ఆశిస్తున్నది. దక్షిణాఫ్రికాలో ఆరు వనే్డలతోపాటు, మరో మూడు టీ-20 మ్యాచ్‌లను కూడా భారత్ ఆడుతుంది. ఆతర్వాత శ్రీలంకలో జరిగే టీ-20 ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. అనంతరం ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి, మూడు వనే్డలు, మరో మూడు టీ-20 ఇంటర్నేషనల్స్‌లో పోటీపడుతుంది. అదే సమయంలో ఈఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎస్) సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళుతుంది. 2019 ప్రపంచ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకొని, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న కొద్ది స్థానాల్లో సరైన ఆటగాళ్లను అనే్వషించడానికి లేదా ఎంపిక చేసి, ఇప్పటి నుంచి ఆ దిశగా తగినన్ని అవకాశాలు ఇవ్వడానికి దక్షిణాఫ్రికాతో జరిగే వనే్డ, టీ-20 సిరీస్‌లను మించిన ప్రారంభం మరొకటి ఉండదని బీసీసీఐ అభిప్రాయపడుతున్నది. టీమిండియా టెస్టుల్లో అంతగా రాణించలేకపోయిన టీమిండియా కూడా కొత్త ఫార్మాట్‌లో సిరీస్‌లకు అన్ని విధాలా సిద్ధమైంది. వనే్డల్లో తిరుగులేని రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ టెస్టుల్లో విఫలమైనప్పటికీ, ఈ సిరీస్‌లో మళ్లీ సత్తా చాటుతాడని అటు జట్టు మేనేజ్‌మెంట్, ఇటు అభిమానులు ఆశిస్తున్నారు. మిగతా ఆటగాళ్లకు కూడా వనే్డ ఫార్మాట్‌లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. అందుకే, సరికొత్త ఫార్మాట్‌లో సరికొత్త ఉత్సాహంతో విరుచుకుపడి, దక్షిణాఫ్రికాను చిత్తు చేసేందుకు కోహ్లీ సేన సంసిద్ధమైంది.
దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు అద్భుతాలు ప్రదర్శించిన సందర్భాలు లేవు. వనే్డల్లో రికార్డు మరింత అధ్వాన్నంగా ఉంది. 1992-93లో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-5 తేడాతో చేజార్చుకుంది. 2006-07లో 0-4, తిరిగి 2010-11లో 2-3 తేడాతో పరాజయాలను చేజార్చుకుంది. 2013-14లో చివరిసారి దక్షిణాఫ్రికాలో వనే్డ సిరీస్ ఆడినప్పుడు 0-2 తేడాతో ఓటమిపాలైంది. కాగా, 1996=97లో తిరిగి 2001-02లో అక్కడ జరిగిన ముక్కోణపు వనే్డ సిరీస్‌ల్లో కూడా టీమిండియా ఆడింది. జింబాబ్వే, కెన్యా జట్లపై విజయాలను నమోదు చేసినప్పటికీ, దయిణాఫ్రికాను ఓడించలేకపోయింది. ఆ రెండు ట్రై సిరీస్‌ల్లోనూ దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. మొత్తం మీద, జాత్యాహంకాన్ని ప్రదర్శిస్తున్న కారణంగా నిషేధానికి గురై, 1992లో సస్పెన్షన్‌ను ఐసీసీ ఎత్తివేయడంతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి దక్షిణాఫ్రికా అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికాలో భారత జట్టు మొత్తం 26 వనే్డలు ఆడింది. వాటిలో కేవలం ఐదింటిని మాత్రమే గెల్చుకుంది. మిగతా 21 వనే్డల్లో పరాజయాలను చవిచూసింది. ఈ అంశం కూడా కోహ్లీ బృందాన్ని వేధిస్తున్నది. పరాజయాల బాట నుంచి బయటపడి, దక్షిణాఫ్రికాలో తొలిసారి వనే్డ సిరీస్‌ను సాధించాలని ఆశిస్తున్న టీమిండియా ఆ స్థాయిలో పోరాడుతుందో, లేదో చూడాలి.
శ్రీలంకతో జరిగిన వనే్డ, టీ-20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పగ్గాలు చేపట్టడంతో, మిడిల్ ఆర్డర్‌లో కేవలం ఒక స్థానం మాత్రమే ఖాళీగా కనిపిస్తున్నది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఆడిన శ్రేయాస్ అయ్యర్ మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధ శతకాలు సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ స్థానానికి అతనితోపాటు దినేష్ కార్తీక్, మనీష్ పాండే తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడే అవకాశం దక్కుతుందనేది ఆసక్తి రేపుతున్నది.
దర్బన్ స్టేడియంలో భారత జట్టు ఇంత వరకూ ఒక్క వనే్డను కూడా గెల్చుకోలేకపోయింది. ఇక్కడ దక్షిణాఫ్రికాతో ఏడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఆరు పరాజయాలను చవిచూసింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు కోహ్లీ సేన కొత్త శకానికి శ్రీకారం చుట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోనీ, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ వంటి హేమాహేమీలు ఉన్న భారత జట్టు వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ఎంత వరకూ ప్రయత్నం చేస్తుందనేదే ప్రశ్న. 2003 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ మైదానంలో ఇంగ్లాండ్, కెన్యా జట్లను ఓడించిన అనుభవం భారత్‌కు ఉంది. ఇక్కడ టీమిండియా సాధించిన విజయాలు ఈ రెండే. దక్షిణాఫ్రికాను గురువారం నాటి మొదటి వనే్డలో ఓడిస్తే, కోహ్లీ సేన ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది.

* ఆస్ట్రేలియా చేతిలో 2016లో 1-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత, భారత్ ఇప్పటి వరకూ స్వదేశంలోగానీ, విదేశాల్లోగానీ ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ను కూడా కోల్పోలేదు. న్యూజిలాండ్, శ్రీలంక జట్లను రెండేసి పర్యాయాలు వనే్డ సిరీస్‌ల్లో ఓడించింది. అదే విధంగా జింబాబ్వే, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాపై ఒక్కో వనే్డ సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొత్తం మీద 2016 నుంచి ఇప్పటి వరకూ 32 ద్వైపాక్షిక వనే్డ మ్యాచ్‌లు ఆడి, 24 మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించింది. గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడడాన్ని మినహాయిస్తే, ఏ టోర్నీలోనూ పరాజయాన్ని ఎదుర్కోలేదు. ఈ అద్భుతమైన రికార్డును కొనసాగించడమే ప్రధాన లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది.
* ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా 120 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండే, 119 పాయింట్లు సంపాదించిన భారత్‌ది రెండో స్థానం. ప్రపంచ మేటి జట్ల మధ్య జరిగే పోరు కాబట్టే వనే్డ సిరీస్‌పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌ను కనీసం 4-2 తేడాతో కైవసం చేసుకుంటే, టీమిండియా నంబర్ వన్ స్థానానికి దూసుకెళుతుంది. ఈ అంశం కూడా కోహ్లీ సేన దృష్టిలో ఉంది.